22, అక్టోబర్ 2021, శుక్రవారం

పసుపు తో పాల వంటి చర్మం మీ సొంతం

 పసుపు తో పాల వంటి చర్మం మీ సొంతం


చాలా మంది యువతులు మరియు యువకులు తమ చర్మం మెరిసి పోవాలని చాలాప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగానే రకరకాల క్రీమ్స్ ను వాడతారు.


క్రీమ్స్ ను వాడటం తప్పు కాదు. కానీరోజు వాడటం వలన మీ చర్మం దెబ్బ తినవచ్చు. ఎప్పుడైనా పెళ్లిళ్లకు వెళ్లేటప్పుడు లేదా ఇంట్లో ఏమన్నా శుభ కార్యాలు ఉన్నప్పుడు క్రీమ్స్ ను  లేదా మేకప్ ను వాడవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.


 ఎప్పుడూ కూడా మేకప్ ను లేదా క్రీమ్స్ ను వాడటం వలన మొహం పైన ఉండే రంద్రాలు మూసుకు పోవచ్చు అని అంటున్నారు.మొహం పైన ఉండే రంధ్రాలు మూసుకుపోవడం వలన మన మొహం పైన ఉండే చర్మం చాలా దెబ్బతింటుంది.


 మరీ ముఖ్యంగా మేకప్ వేయడం వలన మొహం పైన ఉండే చర్మంకి చెమట పట్టదు. చెమట  ఎందుకు పట్టదు అంటే, కాస్మోటిక్స్ వాడటం వలన మన చర్మం పైన ఉండే స్వేద రంధ్రాలు మూసుకుపోతాయి.


 స్వేద రంధ్రాలు మూసుకుపోవడం వలన మనకు చెమట పట్టదు. చెమట పట్టకపోవడం వలన మన శరీరం లోపల నుండి బయటకి వచ్చే కొన్ని కొన్ని వ్యర్ధాలు శరీరం నుండి బయటకి రాకుండా శరీరం లోపలి ఉండిపోతాయి.


 మన శరీరంలో నుండి వ్యర్థాలు బయటకు రాకపోవడం వలన ఆ వ్యర్ధాలు లోపలే ఉండిపోతాయి.వ్యర్థలు లోపలే ఉండిపోయే మన మొహం పైన లేదా మన వీపు పైన లేక ఇతర భాగాలలో మొటిమలు రావడానికి కారణం అవుతాయి.


 ఇది మాత్రమే కాకుండా కాస్మెటిక్స్ వాడకం ఎక్కువగా ఉన్నట్లయితే మన మొహంపైన వేసుకున్న మేకప్ వలన మన శరీరం లోపల నుండ వ్యర్థలు బయటకు రాక పోవడమే కాకుండా మన శరీరం లోపల ఉండే టాక్సిన్స్ బయటకి రాకపోగా మనకు దురదలను మరియు చర్మం దద్దుర్లు రావడానికి కారణమవుతుంది.


 మేకప్ పౌడర్ లను ఎక్కువగా వేసుకోవడం వలన మన చర్మం పైన ఉండే మాయిశ్చరైజింగ్ కణాలు విడుదల చేసే మాయిశ్చరైజర్ ను ఫీల్చేసుకుంటాయి.

 


నుమాయిశ్చరైజర్ ను ఫీల్చేసుకోవడం వలన మన చర్మం పైన  తడి ఆరిపోయి మన చర్మం డీహైడ్రేట్ కు గురవుతుంది.చర్మం డీహైడ్రేషన్ కు గురి కావడం వలన చర్మంపైన పగుళ్లు రావడం మొదలవుతుంది.



 కాస్మటిక్స్ ఎక్కువగా వాడటం వలన మన కళ్ళ మరియు  కళ్ళ కింద ఉండే ప్రాంతం ఎంతగానో  దెబ్బతింటుంది. కళ్ల కింద ఉండే మెలనోసిన్ కాస్మోటిక్స్ ఎక్కువగా వాడటం వలన మరింత నల్లధనం వచ్చేలా చేస్తుంది.


 ఇది మాత్రమే కాకుండా కాస్మెటిక్స్ ఎక్కువగా వాడితే మన కళ్ళు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. రకరకాల వ్యాధులు మన కళ్ళకు వస్తాయి.


 కాస్మోటిక్స్ ఎక్కువగా వాడడం వలన మన చర్మం తన చర్మ కాంతిని పోగొట్టుకోవచ్చు. మన శరీరం రంగు మారిపోవడమే కాకుండా అక్కడ అక్కడ నల్ల మచ్చలు కూడా ఏర్పడతాయి,అని డాక్టర్లు అంటున్నారు.


 నాచురల్ గా మొహాన్ని అందంగా మార్చుకోవడం ఎలాగో డాక్టర్లు చెప్తున్నా  చిట్కాలలో మనం కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం.


 మొదటి చిట్కా:


 కావలసిన పదార్థాలు:


 1. పసుపు

 2. నిమ్మరసం 

 3. పాలు


 తయారు చేసుకునే విధానం:


 ముందుగా రెండు స్పూన్లు పసుపును తీసుకుని, దానిలో రెండు స్పూన్ల నిమ్మరసం మరియు రెండు స్పూన్ల పాలని వేసి బాగా కలపండి.


 ఇలా కలిపిన మిశ్రమాన్ని మొహానికి రాసుకోండి.   ఇలా మొహానికి రాసుకుని  మిశ్రమాన్ని 20 నిమిషాల వరకు  ఉంచుకోండి. ఆ తరువాత మీ మొహాన్ని శుభ్రపరచుకోండి.


 ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేయడం వలన మీ మొహం నేచురల్ గానే అందంగా మరియు ఎంతో కాంతివంతంగా తయారవుతుందిఅని అనడంలో సందేహం లేదు.


 ప్రయోజనాలు:


 పసుపు  మన చర్మానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలుసు. మన చర్మం రంగు రావడానికి మరియు మొహం పైన ఉన్న మచ్చలు పోవడానికి మొహం ఎప్పుడూ కూడా మెరిసే ఎలా ఉండడానికి సహాయపడుతుంది.


 నిమ్మరసం గురించి అందరికీ తెలుసు మన చర్మనికి సి విటమిన్ చాలా అవసరం. విటమిన్ సి అనేది మన చర్మం కాంతి రావడానికి సహాయపడుతుంది. మన మొహం పైన ఉన్న  డెడ్ స్కిన్ సెల్స్ ని పోగొట్టడానికి ఎంతగానో సహాయపడుతుంది.


 ఇంకా పాల విషయానికి వస్తే పాలలో అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. ఒక్క సి విటమిన్ తప్ప. ఇది మన చర్మం హెల్దీ గా ఉండడానికి సహాయపడుతుంది. ఇది మాత్రమే కాకుండా మరీ ముఖ్యంగా మన చర్మం స్మూత్ గా ఉండడానికి ఎంతగానో సహాయపడతాయి.


 రెండవ చిట్కా:


 కావలసిన పదార్థాలు:

 

 1. పెరుగు

 2. తేనె


 తయారు చేసుకునే విధానం:


 ముందుగా రెండు స్పూన్ల పెరుగును తీసుకుని దానిలో రెండు స్పూన్ల తేనె ను కలపండి. అలా కలిపిన మిశ్రమాన్ని మీ మొహానికి రాసుకోండి.


 ఇలా రాసుకుని 15 నిమిషాలు నుండి 20 నిమిషాల వరకు ఉండండి. ఆ తర్వాత మీ మొహాన్ని చల్లని నీటితో శుభ్రపరుచుకోండి.



 ప్రయోజనాలు:


 పెరుగు మన మొహం పైన ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ నిదానికి ఎంతగానో సహాయపడుతుంది.ఇది మాత్రమే కాకుండా చల్లగా ఉన్న పెరుగుని మొహానికి రాసుకోవడం వలన రక్తప్రసరణ బాగా జరుగుతుంది నానమ్మ సందేహం లేదు.


 ఇంకా తేనే విషయానికొస్తే, తేనే చర్మంని కాంతివంతంగా చేస్తుంది. ఇది మాత్రమే కాకుండా మీ చర్మానికి ముడతలు రాకుండా చేయడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది.


 ఇలా రోజూ చేసినట్లయితే మీ చర్మం కాంతి వంతంగా ఉండడమే కాకుండా హెల్దీగా కూడా ఉంటుంది అనడంలో సందేహం లేదు.


మూడవ చిట్కా:


 కావలసిన పదార్ధాలు:

 

 1. పెసరపప్పు

 2. పసుపు

 3. తేనె

 4. పాలు


 తయారు చేసుకునే విధానం:


 ముందుగా ఒక మిక్సీ గిన్నెలో పెసరపప్పు కొంచెం దానిలో కొంచెం పసుపు కొంచెం తేనే మరియు సరిపడినన్ని పాలు పోసి మెత్తగా అయ్యేలా చూసుకోవాలి.


 అలా మెత్తగా అయిన మిశ్రమాన్ని మొహానికి రాసుకోవాలి. ఇలా మొహానికి రాసుకుని 30 నిమిషముల వరకు ఉంచుకోవాలి.


 30 నిమిషాల్లో పూర్తయ్యాక వెళ్లి మొహాన్ని చల్లని నీటితో కడగాలి. ఇలా వారంలో రెండు లేదా మూడుసార్లు చేయడం వలన మీ ముఖంలో కలిగే మార్పును మీరే గమనించవచ్చు.


 ప్రయోజనాలు:


 పెసరపప్పు మెత్తగా  ఎలా చేయడం వలన దానీలో  అక్కడ అక్కడ ఉండే చిన్న చిన్న ముక్కలు మంచి స్క్రాబ్ లాగా పనిచేస్తాయి.


 పసుపు గురించి మనం పైన మాట్లాడుకున్నాము. పసుపు మన ముఖ కాంతిని పెంచుతుంది మరియు మచ్చలను పోగొడుతుంది.


 తేనె గురించి కూడా మనం పైన చర్చించుకున్నాము. తేనే మన చర్మం ముడతలు పడకుండా ఉండడంలో సహాయపడుతుంది. ఇది మాత్రమే కాకుండా తేనే  డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించడంలో ఎంతగానో సహాయపడుతుంది.


 తేనె కూడా మన చర్మం కాంతి రావడానికి ఎంతగానో సహాయపడుతుంది. చర్మం ఎప్పుడూ కూడా డీహైడ్రేట్ అవకుండా ఉండడానికి కూడా తేనే తోడ్పడుతుంది.


 పాల విషయానికి వస్తే, పాల గురించి కూడా మనం పైన మాట్లాడుకున్నాము. పాలు మన చర్మం మృదువుగా ఉండడానికి ఎంతగానో సహాయపడతాయి.


 నేను చెప్పినవన్నీ కూడా డాక్టర్ల చెప్తున్నావే.


 నేను చెప్పిన దానిలో మీకు తెలియనిది ఏమైనా తెలుసుకున్నట్లు అయితే కామెంట్ చేయండి.


 మీరు నాకు ఏమన్నా చెప్పాలి అనుకున్న లేక నన్ను ఏమన్నా అడగాలి అనుకున్నా కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.


 ధన్యవాదములు.







లేబుళ్లు: , , , ,

14, అక్టోబర్ 2021, గురువారం

పెదాలు నల్లగా ఎందుకు ఉంటాయి? జీవితాంతం నల్లగానే ఉంటాయా?

పెదాలు నల్లగా

ఎందుకు ఉంటాయి ?

జీవితాంతం నల్లగానే

ఉంటాయా ?


చాలామంది యువతులు మరియు యువకులు వారి పెదాలు  నల్లగా ఉన్నాయని,దానివల్ల వారు అందంగా కనబడామని అనుకుంటారు.

 అసలు పెదాలు నల్లగా ఎందుకుంటాయి?  నల్లగా ఉన్న పెదాలు అసలు రంగు మారతాయ?  పరిష్కారం ఏమన్నా ఉందా?  లేకపోతే జీవితాంతం ఇలాగే ఉంటాయా?

 ఇలాంటి వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.


 పెదాలు నల్లగా మారడానికి గల కారణాలు:



 పెదాలు నల్లగా మారడానికి గల కారణాలు:


1.మన శరీర రంగును బట్టి కూడా ఉంటాయి.

2. మనము నల్లగా ఉంటే నలుపు రంగులో తెల్లగా ఉంటే ఒక మాదిరి గులాబీ రంగులో ఉంటాయి.

3. మన శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని బట్టి కూడా ఉంటాయి.


4.మనం తాగే మంచినీరు శాతన్ని బట్టి కూడా పెదాల రంగు ఉంటుంది.

5.కొంత మందికి వారసత్వంగా కూడా పేదలకు నలుపు రంగు ఉంటుంది.

6.కొంతమందికి ఎండ వాళ్ళ కూడా పెదాలు నలుపు గా ఉంటాయి.



జీవితాంతం నల్లగానే ఉంటాయా?


 జీవితాంతం పెదాలు నల్లగానే ఉంటాయా అనడిగితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని చెప్పొచ్చు.నేను ఇలా ఎందుకంటున్నానంటే,

 పెదాలు నలుపు దానం అనేది కొంతమందికి పుట్టుకతోనే ఉంటుంది.దానిని మనం వంశపారం పర్యంగా వస్తాయి అని చెప్పొచ్చు.

 ఇలా వంశపారంపర్యంగా పెదాలు నలుపు దానం వచ్చినవారు నలుపు దానం పోవడానికి చికిత్స తీసుకున్నా కూడా ఉపయోగం ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని డాక్టర్లు చెబుతున్నారు.

 ఇప్పుడు మనం పేదలు నలుపుదనం పోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం.

 తీసుకోవలసిన జాగ్రత్తలు:


1.  ముందుగా మన శరీరంలో హిమోగ్లోబిన్ సరిపడా మోతాదులో ఉందో, లేదో తెలుసుకోవాలి.
2. స్త్రీలలో అయితే 12 నుండి 14 గ్రాముల వరకు హిమోగ్లోబిన్ శాతం ఉండాలి.
3. అదే పురుషులలో అయితే 14 నుండి 16 గ్రాముల వరకు హిమోగ్లోబిన్ శాతం ఉండాలి.
4. మరియు మన శరీరంలో ఐరన్ కూడా ఎక్కువ మోతాదులో ఉండాలి.
5. మన శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తగినన్ని మంచినీళ్లు తీసుకుంటూ ఉండాలి.
6. మన వేదాలు పలిగిలినట్లు అనిపిస్తే నెయ్యి రాయడం చాలా మంచిది.
7. రోజుకి రెండు సార్లు నెయ్యి రాస్తే మన పెదాలు పగలడం తగ్గుతుంది.

 ఆహారంలో తీసుకోవలసిన జాగ్రత్తలు:

 
 మన శరీరంలో హిమోగ్లోబిన్ తగిన మోతాదులో ఉండడానికి,మనం ఎక్కువగా రక్తం పట్టే పండ్లను మరియు రసాలను తీసుకోవాలి.
 
 అనగా బీట్ రూట్, దానిమ్మ, ఆపిల్, క్యారెట్ మొదలగు పండ్లను మరియు వాటి రసాలను తీసుకోవాలి.

 మన శరీరంలో ఐరన్ కోసం మనం తీసుకునే ఆహారంలో కనీసం వారంలో 3 రోజులైనా తోటకూర ఉండేలా చూసుకోవాలి.

 తోటకూరలో ఐరన్ చాలా ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. ఇది మన శరీరం అనారోగ్యానికి గురికాకుండా ఉండడానికి కూడా సహాయపడుతుంది.

 పాలను కూడా మనం రోజు తీసుకోవాలి. పాలలో ఉండే విటమిన్స్ మనలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయ పడతాయి.

 నేను చెప్పినవన్నీ కూడా డాక్టర్లు చెప్తున్నావే.

 మీరు నాకు ఏమన్నా చెప్పాలి అనుకున్న లేక నన్ను ఏమన్నా అడగాలి అనుకున్నా కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.


 






లేబుళ్లు: , , , , , ,

13, అక్టోబర్ 2021, బుధవారం

మీ పాదాలు మృదువుగా మరియు మీ చేతులు తెల్లగా రావాలి అంటే ఇలా చేయండి

మీ పాదాలు మృదువుగా

మరియు మీ చేతులు

తెల్లగా రావాలి అంటే ఇలా

          చేయండి




 మనం అందంగా కనిపించాలి అని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.అలా అనుకొన్నప్పుడు మన మొహాన్ని మాత్రమే కాకుండా మన శరీరం పైన కూడా పూర్తి శ్రద్ధ వహించాలి. మన మొహం పైన చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాము.


ఇంకా మన చేతులు, పాదాలు విషయానికి వస్తే కొంతమంది పట్టించుకుంటారు,ఇంక  కొంతమంది అశ్రద్ధ చేస్తారు.మనం చేతులను,పాదాలు పట్టించుకోక పోవడం వలన అవి చూడటానికి అందంగా ఉండవు.


 వాటి పైన ఎంతో టాన్ ఉంటుంది. దీనిని అశ్రద్ధ చేసినట్లయితే టాన్ అనేది బాగా ఎక్కువై పోతోంది. మన పాదాలు,చేతులు గురించి వారంలో కనీసం 3 లేదా 4 సార్లు అయినా జాగ్రత్త తీసుకోవడం మంచిది.


 ఇలా వారానికి మూడు లేదా నాలుగు సార్లు జాగ్రత్త తీసుకోవడం వలన మన పాదాలు మరియు మన మొహం లాగానే అందంగా కనిపిస్తాయి అనడంలో సందేహం లేదు.


 మీ పాదాలను మృదువుగా

మార్చేసే ఒక చిన్న చిట్కా:


 మీ పాదాలకు కొంచెం కొబ్బరి నూనెను గాని లేక నెయ్యి ని గాని ఆలివ్ ఆయిల్ ని గానే రాసుకుని గోరువెచ్చని నీళ్లు లేకపోతే మీ పాదాలకు ఎంత వేడిని అయితే తట్టుకోగలిగి పాదాలు  పెట్టినప్పుడు హాయిగా ఉంటుందో అంత వేడి నీళ్ళలో మీ పాదాలను ఉంచండి.


 ఇలా ఒక అరగంట లేదా ముప్పావు గంట వరకు మీ పాదాలను అలా నీటిలో ఉంచండి. అలా మీ పాదాలను నీటిలో ఉంచడం వలన మీ పాదాల నాను తాయి.


ఇలా నానడం వలన మీ పాదాల పై పేరుకుపోయిన టాన్ తొందరగా వచ్చేస్తుంది. మీ పాదాలను నీటిలో నుండి తీసేయండి.


 మీ పాదాలను నీటిలో నుండి తీసిన తర్వాత పాదాలను తోముకునే బ్రష్ గాని లేకపోతే బట్టలకు రుద్దె  మెత్తటి బ్రష్ గాని తీసుకోండి.



 ఆ బ్రష్ తో మీ పాదాలన సున్నితంగా రుద్దండి. ఇలా రుద్దడం వలన ముందుగానే నాని పోయి ఉండటం వలన మీ పాదాలకు ఉన్న టాన్ తొందరగా వచ్చేస్తుంది.


 శుభ్ర పరిచిన తర్వాత మీ పాదాలకు మాయిశ్చరైజర్ ని రాసుకోండి. ఇలా  ఒక నెల పాటు చేయండి. ఆ తర్వాత వారంలో రెండు లేదా మూడు సార్లు రెండు రెండు నెలలు చేయండి.ఇలా చేయడం వలన మీరు మంచి ఫలితాలను పొందగలరు.


 ఇలా చేయడం వలన పాదాలు తెల్లగా రావడమే కాకుండా మెత్తగా ఎంతో మృధువు గా మారుతాయి.


చేతులు తెల్లగా రావడం కోసం చిట్కాలు :



 మొదటి చిట్కా:


 ముందుగా ఒక గిన్నెలో కొంచెం శనగపిండి, ఒకటి లేదా రెండు స్పున్ ల తేనే, సగం నిమ్మకాయ రసం, హాఫ్ స్పున్ పసుపు, కాచి చల్లార్చిన పాలు ఇవన్నీ కూడా కలిపి మెత్తని పేస్టులా చేయాలి.


 శనగపిండి మన చర్మానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. శనగపిండిని విడిగా ఫేస్ ప్యాక్ కోసం పట్టించుకుంటే అది ఇంకా బాగా  పనిచేస్తుంది.


అలాగే తేనె కూడా మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.తేనెలో మృతకణాలను తొలగించే శక్తి ఉంటుంది. ఇది చర్మాన్ని చెడు ఫంగస్ నుండి రక్షిస్తుంది.


 నిమ్మకాయ మన చర్మానికి ఎంత అవసరమో అందరికీ తెలుసు. దీనిలో సి విటమిన్ ఉంటుంది. ఇది మన చార్మాన్ని కాంతి వంతంగా చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది.


 ఇంకా పసుపు విషయానికి వస్తే  పసుపు అనేది  యాంటీబ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది. ఇది మన చర్మానికి హాని చేసే క్రిముల నుండి మన చర్మాన్ని రక్షిస్తుంది.


పాలు మనకి ఎంతగానో సహాయపడతాయి అని తెలుసు.పాలు మనకి చాలా విటమిన్స్ ని ఇస్తాయి. పాలలో దాదాపు అన్ని విటమిన్స్ ఉంటాయి. ఒక్క సి విటమిన్ తప్ప.


 పాలు కూడా మన చర్మాన్ని కాంతి వంతంగా చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది.


 ఇవన్నీ కలిపిన మిశ్రమాన్ని మన చర్మానికి రాసుకోవడం వలన మన చర్మం ఎంతో కాంతివంతంగా మారుతుంది అని అనడం లో సందేహం లేదు.


 రెండవ చిట్కా:


 చాలామంది  మోచేతులను మరియు మోకాళ్ళను గమనించినట్లయితే అవి ఎంతో నల్లగా ఉంటాయి. ఎక్కువగా స్టూడెంట్స్ ని చూ

 సినట్లయితే మోచేతులు బెంచ్ కి ఆనిచ్చి పెట్టడం వలన మోచేతి దగ్గర ఉండే కొన్ని రకాల సెల్స్ నాశనం అవుతాయి.


 అలా నాశనం అయిన ప్రదేశంలో నలుపు ఎక్కువగా ఏర్పడుతుంది.ఆ నలుపుని పోగొట్టుకోవడానికి.వారు ఎంతగానో కష్టపడతారు. అలాంటి వారికోసం ఈ చిట్కా.

 

 ముందుగా ఒక గిన్నెలో పాలు మరియు బేకింగ్ సోడా తీసుకుని ఒక గిన్నెలో కలిపి పెట్టుకోండి.అలా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మీ మోచేతులు మరియు మీ మోకాళ్ళకు రాసుకోండి.


 పాలు మనకు ఎంతగా సహాయపడతాయి అందరికీ తెలుసు, ఇంకా బేకింగ్ సోడా విషయానికి వస్తే బేకింగ్ సోడాలో ఉండే కొన్ని రకాల సాల్ట్స్ మన శరీరం పైన చనిపోయిన సెల్స్ ని తీసుకోవడానికి సహాయపడతాయి.


 మృత కణాలు తొలగి పోవడం వలన అక్కడ చర్మం ఎంతో తెల్లగా ఉండటమే కాకుండా అక్కడ కొత్త సెల్స్ వస్తాయి.

 

 నేను చెప్పినవన్నీ కూడా డాక్టర్లు చెప్తున్నావే.



 మీరు నాకు ఏమన్నా చెప్పాలి అనుకున్న లేక నన్ను ఏమన్నా అడగాలి అనుకున్నా కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.


 ధన్యవాదములు.






 


లేబుళ్లు: , , , ,

11, అక్టోబర్ 2021, సోమవారం

కళ్ళ కింద నాలుపు రావడానికి గల కారణాలు మరియు వాటిని పోగొట్టే సీక్రెట్స్

 కంటి కింద నలుపు

 రావడానికి గల కారణాలు

 మరియు వాటిని పోగొట్టే

           సీక్రెట్స్

ఈ రోజుల్లో పెద్దవాళ్ళ నుండి చిన్నవాళ్ళ వరకు ఎదుర్కొంటున్న సమస్యలలో డార్క్ సర్కిల్స్(కళ్ళ కింద నలుపు చారలు ) అనేవి ఒక పెద్ద సమస్యగానే చెప్పవచ్చు.


 కళ్ల కింద నలుపు చారలు ఏర్పడినప్పుడు మొహం చూడటానికి అందంగా కనిపించదు. కళ్ళ కింద నలుపు ని పోగొట్టి డానికి మనం విశ్వ ప్రయత్నాలు చేస్తాం.



 అలా చేసే క్రమంలో మన కళ్ళు కూడా దెబ్బతినవచ్చు. ఇలా నేను ఎందుకు అంటున్నాను అంటే మన కళ్ళ కింద నల్లటి చారలు పోవాలి అని మన చర్మానికి సరిపడని క్రీమ్స్ ను వాడతాము.


 చాలా మందికి కళ్ళ కింద నలుపు అనేది ఒక పెద్ద సమస్యగా తయారవుతుంది. దీని ద్వారా వారు నలుగురిలోకి వెళ్లడానికి అంతగా ఇష్టపడరు.


 కొంత మందికి కళ్ళకింద మాత్రమే కాకుండా కళ్ళ చుట్టూ కూడా నలుపు చారలు ఏర్పడతాయి. ఇలా కళ్ళ  చుట్టూ నలుపు చారలు ఉన్నవాళ్లు  ఈ సమస్యను ముందుగానే గుర్తించి డాక్టర్ ల సహాయం తీసుకోవడం మంచిది.

 


 కళ్ళ కింద నల్లటి చారలు ఎందుకు ఏర్పడతాయి:


మరి ముఖ్యంగా ఎండలోకి వెళ్లినప్పుడు సూర్యుని నుండి వెలువడే అతినీలలోహిత కిరణాలు మన  కంటి కింద బాగానే తాగినట్లయితే అక్కడ ఉండే మెలనోసైట్స్ అనే కణాలో మేలనో సీన్స్ అనే నల్లటి వర్ణాన్ని విడుదల చేసే శక్తి కణాలకు ఉంటుంది.


 ఈ మెలనోసైట్స్ అనే కణాలు మన జుట్టు నల్లగా అవడానికి కూడా కారణం అవుతుంది. అనే విధంగా ఎండలోకి వెళ్లినప్పుడు మన చర్మం నల్లగా అవడానికి కూడా కారణం అవుతుంది.


కళ్ల కింద ఉండే చర్మంలో మాయిశ్చర్ గ్లాండ్స్ అనగా తేమన ఉత్పత్తి చేసే కణాలు తక్కువ మొత్తంలో ఉండడం వలన కూడా కళ్ళకింద మనకు నలుపు చారలు ఏర్పడతాయి.


కళ్ళ కింద నల్లటి చారలు అనేవి నిద్ర లేకపోవడం, టెన్షన్కి గురవడం మరియు వాళ్ళ పెద్ద వాళ్ళకి ఉండడం వలన కూడా ఏర్పడతాయి.


 మరి కొంత మందిలో కళ్ళజోడు ఉన్నవాళ్లు పెట్టుకోకపోవడం వలన కూడా ఈ కళ్ళ కింద నల్లటి చారలు ఏర్పడతాయి. కళ్ళని బాగా నలిపి నాకూడా ఈ నల్లటి చారలు ఏర్పడతాయి.


 ఇప్పుడున్న జనరేషన్ లో చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరి దగ్గర కూడా సెల్ ఫోన్స్ మరియు లాప్టాప్స్ చాలావరకు ఉపయోగిస్తున్నారు. కింద నల్లటి చారలు రావడానికి ఇది కూడా ఒక కారణం.


 ఎందుకంటే వాటి నుండి వెలువడే రేడియేషన్ కారణమని చెప్పొచ్చు. ఎక్కువ సేపు సెల్ ఫోన్స్ వాడటం వలన మరియు మనం కంప్యూటర్ స్క్రీన్స్ వైపు ఎక్కువగా చూడటం వలన  వాటి నుండి వెలువడే రేడియేషన్ మా కళ్ళ దెబ్బ తినేలా చేస్తుంది.


 కళ్ళు దెబ్బ తినడం వలన మన కళ్ళ కింద నల్లటి చారలు ఏర్పడతాయి.


 ఇవి మాత్రమే కాకుండా డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్లకు కూడా కళ్ళ కింద నల్లటి చారలు ఏర్పడే అవకాశం ఉంది.


 తీసుకోవాల్సిన జాగ్రత్తలు:


1.  ముఖ్యంగా మనం ఆకు కూరలు తినడం వలన  కంటి కింద నల్లటి చారలు రాకుండా ఉండటంలో సహాయ పడతాయి.

2. మనం తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ మరియు విటమిన్ ఇ లు ఉండేలా చూసుకోవాలి.

3. మాంసాహారం తినే వాళ్ళు ఎక్కువగా చేపను వాళ్ల ఆహారంలో తీసుకున్నట్లయితే కళ్ళ కింద నల్ల చారలు రాకుండా ఉంటాయి.

4. ఆహారం తీసుకోని వారు మన ఆహారంలో ఎక్కువ ప్రోటీన్స్ ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కంటి కింద నలుపు చారలు రాకుండా మాత్రమే కాకుండా వారి చర్మం కూడా బాగుంటుంది.

5. మనం తీసుకునే ఆహారంలో హై ప్రోటీన్ ఉండడం వలన చర్మం ముడతలు పడకుండా ఉంటుంది అనడంలో సందేహం లేదు.

6. మన చర్మంలో కొల్లాజెన్ లెవెల్స్ ఎక్కువగా ఉండాలి అంటే విటమిన్ సి అనేది అవసరమవుతుంది.

7. మనం మన బాడీ కి సరిపడా మంచి నీళ్లు తీసుకోవడం వలన కూడా కళ్ల కింద నలుపు రాకుండా కాపాడుకోవచ్చు.

8. ఎవరైతే మంచినీళ్లు తమ బాడీకి మరియు వయసుకి సరిపడినన్ని మంచినీళ్లు తాగడం వలన 40 సంవత్సరాల వరకు కూడా కళ్ళ కింది నల్లటి చారలు రావఅని డాక్టర్లు చెబుతున్నారు.


 కళ్ళకింద నలుపు ని పోగొట్టి డానికి

 డాక్టర్లు చెప్తున్న చిట్కాలు:


 మనము మరీ ముఖ్యంగా  మన కళ్ళకు ఎక్ససైజ్ చేయించాలి. ఎక్ససైజ్ చేయించడం వలన మన కళ్ళకు రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది అని డాక్టర్లు చెబుతున్నారు.


 కళ్ళకు చేసే ఎక్ససైజ్ ఏంటంటే కళ్ళను గట్టిగా మూస్తూ, తెరుస్తూ ఉండాలి. ఇలా రోజులో రెండు సార్లు పది నిమిషాల చొప్పున చేస్తే మంచి ఫలితాలను పొందుతారు.


 ముందుగా ప్యూర్ హనీ (మంచి తేనె )ని కొంచెం తీసుకుని దానిని మన కళ్ళకింద రాస్తూ ఒక పావు గంట వరకు రాస్తూ మర్దన చెయ్యాలి.


 పావుగంట మర్దనా చేసి అరగంట వరకు వేచి ఉండండి. అరగంట అయిన తర్వాత మీ ముఖాన్ని కడుక్కుని లేదా అలాగే ఉంచుకొని దానిపైన చల్లటి మట్టిని తీసుకుని మనం ఎక్కడైతే మర్దనా చేసామో ఆ ప్రదేశంలో పెట్టుకోవాలి.


 ఇలా చేయడం వలన తేనె మన కళ్ళ కింద ఉండే భాగంలో ఆ తేనే చర్మం లోపలికి వెళ్లి అక్కడ  మేలనో సైడ్స్ ఇన్ఫర్మేషన్ ని తగ్గించడం లో సహాయపడుతుంది.


 ఇంకా మట్టి విషయానికొస్తే చల్లటి మట్టి మన చర్మంపైన పేరుకుపోయిన మృత కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇవి మాత్రమే కాక మన కంటికి మట్టి తగలడం వలన కంటి దగ్గర రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది.


కళ్ళ కింద నలుపు పోవడానికి

ఎలాంటి విటమిన్స్  అవసరం:


1. మన కళ్ళకి విటమిన్ సి మరియు విటమిన్ ఏ లు చాలా అవసరం.

2. విటమిన్ ఎ కోసం మనం క్యారెట్ జ్యూస్ తీసుకుంటే మంచిది.

3. క్యారెట్ లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.

4. క్యారెట్ జ్యూస్ లో 2 టమాటాలు మరియు సగం లేదా పావు బీట్ రూట్ మరియు ఒక కీర వేసి జ్యూస్ లాగా చేసుకుని తాగడం వలన విటమిన్ ఏమన కళ్ళకు అందుతోంది.

5. విటమిన్ సి కోసం మధ్యాహ్నం సమయంలో గానీ లేక సాయంత్రం సమయంలో గానీ నిమ్మకాయ రసం తీసుకుంటే మనకు సి విటమిన్ అందుతుంది.

ఇవి అన్నీ కూడా ప్రకృతి నుండి లభించే వే.


 మీరు దీనిలో కొత్తగా ఏమన్నా తెలుసుకున్నట్లు అయితే కామెంట్ చేయండి.


 మీరు నాకు ఏమన్నా చెప్పాలి అనుకున్న లేక నన్ను ఏమన్నా అడగాలి అనుకున్నా కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.


ధన్యవాదములు.







 




లేబుళ్లు: , , ,

10, అక్టోబర్ 2021, ఆదివారం

మొటిమలను తగ్గించాలా? అయితే ఇది మీ కోసమే

మొటిమలను తగ్గించాలా?

అయితే ఇది మీ కోసమే 

చాలా మంది యువతులు మరియు యువకులు ఎదుర్కొంటున్న సమస్యలలో మొటిమలు రావడం మచ్చలు ఏర్పడడం అనేది ఒక సమస్య గా చెప్పుకోవచ్చు.


యువతులను మరియు యువకులను ఇవి చాలా మేరకు బాధిస్తుంది అని చెప్పడం లో సందేహం లేదు. వీటిని తగ్గించుకునే ప్రయత్నంలో యువతులు మరియు యువకులు చాలా రకాల రసయనాలు కలిసిన క్రెమ్స్ ను వాడుతున్నారు.


 అవి వాడటం వలన మన సమస్యలు ఇంకా పెరగవచ్చు అని చెప్తున్నారు నిపుణులు.

 

మొటిమలు ఎందుకు వస్తాయి:


 సెభాసెయస్ గ్లాండ్స్ అనేవి ఇంప్లిమెంటేషన్ చేయడం వలన మొటిమలు ఏర్పడతాయి. వీటి ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది అంటే డెడ్ స్కిన్ సెల్స్ మరియు ఆయిల్ ఫుడ్ మనం తీసుకున్నప్పుడు ఏర్పడే కొవ్వు ఇవి రెండూ కలిసి సెభాసెయస్ గ్లాండ్స్ డాగ్స్ ని బ్లోక్ చేస్తాయి.


 ఇలా బ్లాక్ చేయడం వలన మొటిమలు,బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ అనేవి రావడం జరుగుతుంది.


మొటిమలు రావడానికి గల కారణాలు:



 చాలా వరకు మొటిమలు అనేవి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలెనే ఏర్పడతాయి. అంటే మనం తీసుకునే ఆహారంలో తగినన్ని విటమిన్స్ మరియు పోషకాలు లేకపోవడాంనే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటారు.

 


మన శరీరంలో జరిగే మార్పుల వలన కూడా మొటిమలు ఏర్పడతాయి. ఈ రోజుల్లో మనం ఎక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్స్ కలిగిన ఆహారాన్ని తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు.


ఉదాహరణకు బర్గర్లు, పిజ్జాలు  మొదలగు జంక్ ఫుడ్స్. ఇలాంటి వాటిలో కార్బోహైడ్రేట్స్ మరియు హై ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వలన మన శరీరంలో కొవ్వు పేరుకు పోవడమే కాకుండా మొటిమలు రావడానికి కారణమవుతుంది.


కొన్ని కొన్ని సార్లు అయితే మనం శరీరానికి సహకరించని ఫేస్ వాష్ స్ మరియు ఫేస్ క్రీమ్ లు వాడటం వలన కూడా మనకు మొటిమలు వస్తాయి.

 

మొటిమల లోని రకాలు:

 

బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ అనేవి మొటిమల జాతికి సంబంధించినవి.మనలో చాలా మందికి బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ అనేవి మొటిమల జాతికి చెందినవి అని చాలా వరకు తెలియదు.మొటిమలు అనేవి చిన్న చిన్న గడ్డలు గా కూడా వస్తాయి.

 

     ఇలా రావడం వలన మన మొహం పైన మచ్చలు మరియు గుంతలు గా ఏర్పడతాయి. ఇలా మొహం పైన మచ్చలు మరియు గుంతలు ఏర్పడటం వలన  చాలా మందికి వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే అవకాశం ఉంది.

కొన్ని రకాల మొటిమలు అయితే భుజాలపైన,వీపు పైన, బ్రెస్ట్ పైన, బటక్స్ పైన కూడా వస్తాయి.

 

మొటిమలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

 

 

మీకు మొటిమలు ఎందుకు వస్తున్నాయి అనేది మీరు ముందుగా తెలుసుకోవాలి.మీకు మొటిమలు ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ముందుగా డాక్టర్ ని కలవాల్సి ఉంటుంది. డాక్టర్ చెప్పిన సూచనలను మీరు పాటించాల్సి ఉంటుంది.

 

మీరు రసాయనాలు కలిసిన క్రీమ్స్  ని వాడటం మానేస్తే మంచిది. మీ చర్మానికి సరిపడని ఫేస్ వాష్ లను మరియు సబ్బులను ఆపేయడం కూడా మంచిదే.


 జంక్ ఫుడ్స్ అనగా పిజ్జాలు, బర్గర్లు మొదలగు హై ప్రోటీన్  ఆహారాన్ని తీసుకోకపోవడమే మంచిది అని డాక్టర్లు చెబుతున్నారు.


 మనం తీసుకునే ఆహారంలో కూడా జాగ్రత్తలు పాటించాలి.ఎక్కువగా కొవ్వు ను అందించే పదార్థాలను  కూడా తినకూడదు.


 మీ కోసం ఒక చిట్కా:

 మీ మొహం పైన మొటిమలు మరియు వాటి ద్వారా ఏర్పడిన మచ్చలు ఉన్నట్లయితే మీరు ఈ విధంగా చేయండి.

మీరు కొన్ని రోజుల ముందుగా బత్తాకాయ తొక్కలనో లేకపోతే కమలా కాయ తొక్కలనో బాగా ఎండబెట్టాలి. వీటిలో సి విటమిన్ ఉన్నందువలన అది మీ మొహం పైన ఉండే మొటిమలను మరియు మచ్చలను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.


ఇలా ఎండబెట్టిన తర్వాత వాటిని మిక్సీలో వేసి బాగా మెత్తగా అయ్యేలా చూసుకోవాలి.మెత్తగా అయిన పొడిని ముందుగా జల్లించి పెట్టుకోండి. ఇలా చెల్లించడం వలన మనకు కనబడ కుండా ఉండి గీసుకునేవి ఏమన్నా ఉంటే అవి తొలగించబడతాయి.


బంగాళాదుంపను సగానికి కోసి దానిపైన ఫోర్క్ తో గుచ్చండి. అలా గుచ్చినప్పుడు దాని లోపల నుండి వచ్చే రసంని మీ ముఖానికి రాసుకోండి.

 

ఇలా కుదరకపోతే బంగాళదుంప తొక్కను తీసేసి కాస్త మెత్తగా అయ్యేలా పప్పు గుత్తు తో కొట్టండి. అలా కొట్టిన తర్వాత వచ్చిన రసాన్ని దూది సహాయంతో మీ మొహం పైన రాసుకోండి.


 ఇలా రాసుకునే సందర్భంలో మీ కళ్ళకు తగలకుండా జాగ్రత్త వహించాలి. మీ మొహం పైన ఉన్న తడి ఆరిపోయి అంతవరకు వేచి ఉండండి.

 


 మొహం పైన ఉన్న తడి ఆరిపోయిన తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న పొడిని కొంచం తీసుకుని దానిలో ఒక స్పూన్ పెరుగు కలపండి.

 

ఆలా కలిపిన మిశ్రమం ను మీ మొహానికి మెల్లిగా రాయండి. ఒక ఐదు నిమిషాల వరకు మీ మొహానికి ఆ మిశ్రమం ను   రాస్తూనే ఉండండి.రాసిన తర్వాత పది నిమిషాలు ఉండి మీ మొహాన్ని కనుక్కోవచ్చు.


మొహం పైన మొటిమలు,  మచ్చలు ఎక్కువగా ఉన్నవారు దీనిని ప్రతిరోజు చేయడం వలన రెండు వారాల్లోనే మీరు మంచి ఫలితాన్ని పొందుతారు.


 నేను చెప్పిన పదార్థాలన్నీ కూడా ప్రకృతి మనకు ప్రసాదించిన వే. మీరు ఇది గమనించాలి.


 మీరు దీనిలో కొత్త విషయాన్ని తెలుసుకున్నట్లు అయితే కామెంట్ చేయండి.


 మీరు నాకు ఏమన్నా చెప్పాలి అనుకున్న లేక నన్ను ఏమని అడగాలి అనుకున్న కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.


 ధన్యవాదములు.



 






 








 

 





 













లేబుళ్లు: , , , ,

9, అక్టోబర్ 2021, శనివారం

దృఢమైన కురుల కోసం ఈ ఒక్కటి

 దృదమైన కురుల కోసం

            ఈ ఒక్కటి


మనం అందంగా కనబడుతున్నాము అంటే దానిలో మొహం పాత్ర మాత్రమే కాకుండా మన జుట్టు  చాలా పాత్ర వహిస్తుంది. మనం  అందంగా కనిపించడానికి రకరకాల హెయిర్ స్టైల్స్ వేసుకుంటాం.


అస్సలు మనకు జుట్టు ఎందుకు వుండుతుంది. అస్సలు కారణం ఏంటి, జుట్టు తిరిగి మాములుగా పెరగాలి అంటే ఎం చెయ్యాలి, ఎం వాడాలి, ఏలాంటి విటమిన్స్ కావాలి అనే వాటి గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం.


మీ కురులు బలంగా,చక్కగా, ఒత్తుగా పెరగాలి అని మీరు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తుంటారు.అలా చేసే ప్రయత్నంలో మీరు చాలా  కేమికల్స్ కలిసిన వాటిని వాడే ఉంటారు. వాటిలో మీకు కొన్ని పని చేస్తాయి మరి కొన్ని మరి కొన్ని ప్రయత్నాలు విఫలం అవుతాయి.


ఇలాంటి ప్రయత్నాలు చేసే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.వాటిలో కొన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.


 ముందుగా మాన కేశాలకు ఎలాంటి విటమిన్స్ కావాలి,ఎలాంటి ప్రోటీన్స్ అవసరం,ఎలాంటి పోషక ఆహరం తెస్కుంటే మంచిది,ఏమి వాడితే కేశాలు చక్కగా, ఒత్తుగా,బలంగా పెరుగుతాయి తెలుసుకుందాం.


 ముందుగా మనం కెమికల్స్ కలిసిన వాటిని వాడటం మానేయాలి. అలాంటి వాటిని వాడటం వలన మనకు కొత్త జుట్టు రావడం ఏమోగానీ ఉన్న జుట్టు ఊడిపోవటం కాయం.


 కాబట్టి మనం కెమికల్స్ కలిసిన వాటికి దూరంగా ఉండటం మంచిది మరియు ప్రకృతి మనకు ప్రసాదించిన వాటితోనే మన కేశాలను దృఢంగా మరియు ఒత్తుగా, అందంగా ఎలా మార్చుకోవాలి మరియు ఎలాంటి వనరులను ఉపయోగించుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.




కొబ్బరి నూనె మరియు అలోవెరా :



 కొబ్బరి నూనె అనేది ప్రాచీన భారతదేశ కాలం నుండి ఇప్పటి వరకు ఎంతో మంచి  నూనె గా పేరు పొందింది. దీనిని మన పూర్వీకులు కూడా ఉపయోగించారు. మన పూర్వీకులు జుట్టు ఇప్పుడున్న మన జుట్టు రెండింటినీ కూడా పక్కనపెట్టి చూసుకుంటే మనకు ఎంతో తేడా కనిపిస్తుంది.


 ఆ తేడా ఎందుకు ఉన్నది అనేది ఆలోచిస్తే మనకు చాలా తేడాలు కనిపిస్తాయి. ఉదాహరణకు అప్పుడు ఉన్న వాతావరణం, అప్పుడు ఉన్న కాలుష్యం ఇలా చెప్పుకుంటూ  పోతే మనకు చాలానే తేడాలు కనిపిస్తాయి.


 ఇక ఇప్పుడు ఉన్న వాతావరణం, బాగా పెరిగిపోతున్న కాలుష్యం, ప్రతి దానిలో కూడా కెమికల్స్ కలవడం సహజమైపోయింది. అంతెందుకు మనం పీల్చే గాలి కూడా కాలుష్యం అయిపోయింది. గాలిలో కూడా చాలానే కెమికల్ కలుస్తున్నాయి అనడంలో తప్పులేదు అనిపిస్తుంది..



ఇంకా అలోవెరా విషయాన్ని వస్తే అలోవెరా లో మన జుట్టుకి ఎంతో అవసరమైన విటమిన్ ఈ అనేది అలోవెరా లో ఉంటుంది. దీని వాళ్ళ మన జుట్టు కు అవసరం అయినా పోషకాలు లభిస్తున్నాయి అనడం లో తప్పు లేదు.


విటమిన్ ఈ అనేది మన జుట్టు వుండకుండా ఉండడటానికి మరియు చివర్లు చిట్లకుండా ఉండడానికి తొడ్పాడుతుంది . అదే విధం గా అలోవెరా లో కొబ్బరి నూనె ని కలిపి రాసుకోవడం వాళ్ళ మన జుట్టు కు చాలా మంచిగా పనిచేస్తుంది..


అలోవెరా లో కొబ్బరి నూనె కలిపి రాసుకోవడం వల్ల  మన జుట్టు కు విటమిన్ ఈ అందడమే కాకుండా కొబ్బరి నూనె మన జుట్టు ను తేమగ ఉండేలా చేస్తుంది.

ఇలా మన జుట్టు తేమగ ఉండటం వలన మన జుట్టు తేమగ ఉండటం లోనే కాకుండా తలనొప్పి రాకుండా చేయడంలో కూడా  సహాయపడుతుంది.


 తయారు చేసుకునే విధానం:


 ముందుగా  అలోవెరా మొక్క నుండి అలోవెరా ను కట్ చేస్కుని తీసుకోవాలి. అలా తీసుకున్న అలోవెరా ను శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న అలోవేరా ను ఉండగా అంచులను తొలగించాలి. అలా తొలగించిన అలోవెరా ను పైన పొరాను చాకు సహాయం తో తొలగించాలి.


 అలా తొలగించిన తర్వాత అలోవెరా లోని కండను నాకు సహాయం తోనో తీయాలి లేక ఫోన్ సహాయం తోనో మెల్లిగా తీయాలి. అలా తీసిన కండను మిక్సీ గిన్నెలో వేసుకుని మిక్సీ పట్టాలి.


 అలోవేరా లోని కండ పూర్తిగా మెత్తగా అయ్యేలా చూసుకోవాలి. మెత్తగా అయిన పేస్టును ఒక గిన్నెలోకి తీసుకుని, దానిలో ఒక స్పూన్ కొబ్బరి నూనె కలిపి మెత్తగా అయ్యేలా చూసుకోవాలి.


 ఇలా మనం తయారు చేసుకున్న పేస్టు ని ముందుగా మన జుట్టు కుదుళ్లకు బాగా పట్టించుకోవాలి. అలా పట్టించు కోవడం వలన  మన కుదుళ్ళ లో కి ఆ మిశ్రమం బాగా పడుతుంది.


 అలా పట్టడం వలన మన కేశాలకు కావలసిన విటమిన్ ఈ అనేది సమృద్ధిగా లభిస్తుంది. ఇలా లభించడం వలన మన కేశాలు బలంగా మరియు ఒత్తుగా తయారవుతాయి.


 ఇలా పట్టించుకున్న 30 నిమిషాల తర్వాత మనం తల స్నానం చేయడం వలన మంచి  ఫలితన్ని  మనం పొందావచ్చు. ఇలా వారానికి ఒకసారి చేయడం కలిగే మార్పులను మీరే గమనించవచ్చు.


 జుట్టు రావడానికి గల కారణాలు:


 జుట్టు రాలడానికి చాలానే కారణాలు ఉంటాయి. వాతావరణం లో జరిగే మార్పులు, కాలుష్యం ఎక్కువగా పెరిగిపోవడం,మనలో  జుట్టు పెరగడానికి ఎలా విటమిన్స్ తక్కువగా ఉండడం, మన శరీరం లో సరిపడా నీటి శాతం లేకపోవడం వలన కూడా జుట్టు ఊడుతుంది.


 మనం తినే ఆహారంలో విటమిన్ తక్కువగా ఉండడం వలన కూడా  జుట్టు ఊడుతుంది. ఇవి మాత్రమే కాకుండా, మనం మానసికంగా సమస్యలను ఎదుర్కొనే సమయంలో కూడా జుట్టు రాలిపోవడం మీరు గమనించవచ్చు.


 జుట్టు రాలడానికి మీరు చేసే జాబ్ కూడా ఒక కారణం అవ్వచ్చు. ఉదాహరణకు మీరు కంప్యూటర్ వర్క్ చేసే వారైతే మీ కళ్ళు ఎప్పుడూ కూడా స్క్రీన్ చూడటం మీదే ఉంటాయి.


 అలా ఎక్కువ సేపు స్క్రీన్ ని చూడటం వలన మన కళ్ళు దెబ్బతింటాయి. కళ్ళు దెబ్బ తినడం వలన తల నొప్పి  తప్పకుండా వస్తుంది. తలనొప్పి రావడం వలన జుట్టు ఊడటానికి కూడా కారణమౌతుంది.


 ఇదే విధంగా చాలా రకాలుగా మనం చేసే జాబ్ కూడా మన జుట్టు ఉండడానికి ఒక కారణం అవుతుంది.


 తీసుకోవలసిన జాగ్రత్తలు:


 మనం తినే ఆహారంలో జుట్టు పెరగడానికి అవసరమయ్యే పోషకాలు ఉండేలా చూసుకోవాలి. మనం ఉండే వాతావరణం కూడా మనకు తగ్గట్టుగా ఉందో లేదో అనేది కూడా గమనించాలి.


 బయటికి వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి. గాలిలో కాలుష్యం ఎక్కువగా పెరగడం వలన గాలి ద్వారా దుమ్ము అనేది మన తల లోకి వచ్చి చేరుతుంది.


 అలా చేరకుండా ఉండేలా మనం జాగ్రత్త పడాలి. తనకి వారంలో కనీసం నాలుగు సార్లు అయినా నూనె పెట్టడం మంచిది. నూనె పెట్టడం వలన మన జుట్టు తెమగ గా ఉండడమే కాకుండా మనకు తలనొప్పి రాకుండా ఉండడం లో కూడా సహాయపడుతుంది.


 ముఖ్యంగా కెమికల్స్ కలిసిన నూనెలను వాడడం పూర్తిగా మానేయాలి. రసాయనాలు కలిసిన నూనెలను వాడటం వలన మనకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.


 రసాయనాలు కలిసి నూనెలను వాడటం మానేస్తే జుట్టును కాపాడుకోవడమే కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు.


 ముఖ్యంగా అలోవేరా ను మన కురులకు పెట్టుకోవడం వలన మనం తలనొప్పి నుండి కూడా బయటపడొచ్చు. అలోవేరా ను  మన తలకు పెట్టుకున్నప్పుడు ఎంతో చల్లదనాన్ని  ఇస్తుంది.


 అలోవేరా ను తినడం వలన కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు

అలోవెరా ను తినడం వలన మధుమేహం వ్యాధికంట్రోల్లో ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.

ఒకవేళ మీరు రసాయనలు కలిసినవి వాడాలి అనుకుంటే డాక్టర్స్ ను అడిగి వాడవచ్చు.

 మీరు నాకు ఏమన్నా చెప్పాలి అనుకున్న లేక నన్ను ఏమన్నా అడగాలి అనుకున్నా కామెంట్ బాక్స్ లో అడగగలరు.

 ధన్యవాదములు.


 






















లేబుళ్లు: , , , , , ,

8, అక్టోబర్ 2021, శుక్రవారం

డైటింగ్ లో జాగ్రత్తలు తప్పనిసరి

 డైటింగ్  లో  జాగ్రత్తలు

       తప్పనిసరి

కొంత తమంది యువతులు ఒకరిని చూసి ఒకరు సన్నగా నాజూగ్గా మారాలి అనుకుని విశ్వ ప్రయత్నాలు చేస్తారు. అలా చేసే ప్రయత్నంలో అన్నం తినడం మానేస్తారు.ఎప్పుడూ కూడా అద్దం ముందు కూర్చుని చూసుకుంటారు నేను సన్నగా అయ్యానా లేదా అని. అలా అన్నం తినకుండా ఉండడం వలన మీరు ఎంతో బలహీనంగా తయారవుతారు.

 చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఎంతసేపు స్లిమ్ముగా, నాజూగ్గా అవ్వాలని ఆలోచన చేస్తూనే ఉంటారు. ఇలా చేయడం వలన మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. అంతేకాకుండా మిమ్మల్ని చూసి మీ ఇంట్లో వాళ్ళు కంగారు పడవచ్చు.

 డాక్టర్లు కూడా ఇదే చెబుతున్నారు. డైటింగ్ అనే పేరుతో మిమ్మల్ని మీరే ఆనారోగ్యం పాలు చేసుకుంటున్నారు. ఇవే కాకుండా మీ అందాన్ని కూడా మీరు కోల్పోతున్నారు.

 

 డైటింగ్ అనేది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

 

 ప్రోటీన్లు:

 

 ప్రొటీన్లు అనేవి శరీరానికి చాలా అవసరం. శరీరంలో కావలసినంత ప్రోటీన్లు లేకపోవడం వలన మన శరీరం అలసిపోతుంది. అలసి పోకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి.

 

 మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఆకుపచ్చని కూరలు అధిక శాతంలో ఉండేలా చూసుకోవాలి. వీటిలో విటమిన్స్ అధిక మోతాదులో ఉంటాయి. కాబట్టి మీరు డైట్ చేసేటప్పుడు ఇవి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.

 

 మీరు తినే కూరలు ఉప్పు, కారాలు ఉన్నా పరవాలేదు గాని నూనె లేకుండా చూసుకోండి.అలాగే బంగాళదుంపను మీరు డైట్ వున్నా రోజులలో తినకుండా ఉండడమే మంచిది.

 

 ఇదే విధంగా అరటిపండును కూడా మీరు డైట్ వున్న సమయాలలో తినకుండా ఉండడమే మంచిది అంటున్నారు డాక్టర్లు. అరటి పండు మనం బరువు పెరగడానికి కారణమవుతోంది. అందుకనే మనం డైట్ లో ఉన్నప్పుడు అరటి పండులో తినకుండా ఉండడమే మంచిది.

 

 

 అల్పాహారం:

 

 మీరు డైట్ వున్నా సమయాలలో అల్పహారాన్ని మానకూడదు. వీలైనంత తక్కువగా మోతాదులో కార్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకోవాలి. తేలికగా జీర్ణమయి,ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

 

 పండ్లు లాంటివి తీసుకోవడం వలన ప్రోటీన్లు అందడమే కాకుండా తొందరగా జీర్ణమవుతాయి. రోజుకి ఆరు నుండి ఏడు గ్లాసుల నీళ్ళు తీసుకోవడం వలన మన శరీరం డిహైడ్రేట్ కి గురికాకుండా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా శక్తిని కూడా కోల్పోకుండా ఉంటాము.

 

 డైట్ లో ఉన్నప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ ని తినకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే వీటిని చాలా మంది ఇష్టపడతారు వాటిని తినకుండా కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమే ఎందుకంటే అవి అంత రుచిగా ఉంటాయి.


 కానీ తప్పదు డైటింగ్ లో ఉన్నప్పుడు పక్కన పెట్టేయాలి. వీటిలో బంగాళదుంప ఉంటుంది. బంగాళదుంప లో అధిక మొత్తంలోకార్బోహైడ్రేట్లు ఉంటాయి. అవి మనం బరువు పెరగడానికి కారణం అవుతాయి.

 

 

 కండరాలు:

 

 డైటింగ్ చేస్తున్నాం కదా అని మనం ప్రతిరోజూ చేసే వ్యాయామాన్ని పక్కన పెట్టకూడదు. వ్యాయామం చేస్తూనే ఉండాలి. ఇది మాత్రమే కాకుండా వర్కవుట్లు, వాకింగ్, మెట్లు ఎక్కి దిగడం ఇలాంటి పనులు చేయడం వలన మన శరీరంలోని క్యాలరీలు కరుగుతాయి.

 

 కేలరీలు కరగడమే కాకుండా పైన చెప్పినవి చేయడం వలన మన కండరాలు బలంగా తయారవుతాయి. కండరాల తో పాటు మన జీర్ణ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేస్తుంది.

 

 మనం తీసుకునే ఆహారంలో కూరలు తప్పనిసరిగా ఉండాలి వీలైనంతవరకు కూరగాయలను పచ్చిగా గాని లేదా ఉడకబెట్టుకొని గాని తినడానికి ఇష్టపడండి. మీ వల్ల కాకపోతే ఉప్పు కారం వేసుకుని తినండి.


అంతేగాని నూనె మాత్రం వాడకండి.కూరగాయలలో బ్రకోలి తినడం వలన దానిలోవిటమిన్ సి, కె,పొటాషియం పోలిక్ యాసిడ్ ఉంటాయి. ఈ విటమిన్స్ ఉండటం వలన మనకు ప్రోటీన్స్ అందుతాయి.

 

 డైటింగ్ చేసేటప్పుడు షుగర్ లెవెల్స్ ఎలా ఉండాలి:

 

 ఉన్నపళంగా మనం తీసుకునే స్వీట్స్,ఐస్ క్రీమ్స్, శీతల పానీయాలు, పండ్ల రసాలు మన శరీరంలోని లారీలను పెంచుతాయి.కాస్త కష్టమైనా గాని మనం డైటింగ్ చేసే సమయంలో వీటికి దూరంగా ఉండటమే మంచిది. ఇవి మనం బరువు పెరగడానికి కారణం అవుతాయి.

 

 వీటిని పక్కన పెట్టి వీటికి బదులుగా పండ్ల ముక్కలను తీసుకోవచ్చు వీటిలో అరటికాయ మినహాయించి అన్ని పండ్లను తినవచ్చు. మరిముఖ్యంగా పుచ్చకాయ మరియు కివి అలాంటి పండ్లను తీసుకోవడం వలన మనము తొందరగా అలసిపోము. బదులుగా ప్రోటీన్లు కూడా మనకు అందుతాయి.


 మధుమేహం ఉన్న వారు,షుగర్ లేని వాళ్ళు ఎవరైనా గాని డైటింగ్ చేసేటప్పుడు వీటిని అసలు తినకూడదు అవి ఏమనగా వైట్ బ్రెడ్ ను అసలు తినకూడదు పూర్తిగా పక్కన పెట్టడమే మంచిది.


ఎందుకనగా వైట్ బ్రెడ్ లో ఎక్కువ శాతం లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా వైట్ బ్రెడ్ లో చక్కెర శాతం కూడా ఎక్కువగా ఉంటుంది.


 చక్కెర శాతం ఎక్కువగా ఉండడం వలన చక్కెర స్థాయి అమాంతంగా పెరిగి పోతుంది. స్థాయి పెరగడం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది మాత్రమే కాకుండా బరువు పెరగడానికి కారణమవుతుంది.


 మనం డైటింగ్ లో ఉన్నప్పుడు తక్కువ శాతంలో రైస్ తీసుకోవడం మంచిది.ఒకవేళ తప్పదు మేము రైస్ తీసుకోవాలి అనుకునేవారు, వైట్ రైస్ కి బదులు బ్రౌన్ రైస్ ని తీసుకోవడం మంచిది.


 ఎందుకనగా వైట్ రైస్ లో కార్బోహైడ్రేట్లు మరియు ఫైబర్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఇవి తీసుకోవడం వలన బరువు పెరగడానికి కారణం అవుతాయి.వీటి వల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి.


 అందుకని షుగర్ ఉన్న వాళ్ళు డైటింగ్ లో ఉండే టప్పుడు వైట్ డ్రెస్ కి బదులు బ్రౌన్ రైస్ చేసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు. షుగర్ లేని వాళ్ళు కూడా వైట్ రైస్ తీసుకోకుండా ఉండడమే మంచిది.


 ఆయాసం ఉన్నవారు డైటింగ్ చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల:


 ఆయాసం ఉన్నవారు డైటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. వాటిలో కొన్ని మనం ఎప్పుడు మాట్లాడుకుందాం. ఆయాసం ఉన్నవారు రోజులో రెండుసార్లు మాత్రమే తినడం మంచిది.


 ఎందుకనగా రోజులు రెండు సార్లు తినడం వలన హెవీ గా ఉండవచ్చు. దానివలన మనం ఆయాసానికి గురవుతారు. రోజులో రెండు సార్లు తినడం వలన మనకు ఆయాసం రాదు, ఇది మాత్రమే కాకుండా మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము.


 ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి సమయంలో తినాలి అనే వాటి గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం


 ఉదయాన్నే తీసుకొనే ఆహారంలో మనం వెజిటేబుల్ జ్యూస్ తాగడం వలన మనకు తేలికగా ఉంటుంది. దాని వలన మనకు ఆయాసం అనేది రాదు. తీసుకున్న గంటకు లేదా ముప్పావు గంట కు మనకు ఆకలి వేస్తుంది.


 ఆ సమయంలో మనము తీసుకునే ఆహారంలో రైస్ లేకుండా చూసుకోవడం మంచిది. రెండు పుల్కాలు, రెండు కూరలు, ఒక కప్పు పెరుగు తీసుకోవడం మంచిది. ఎక్కువగా కూరలను తినడం మంచిది.


 సాయంత్రం సమయంలో మనం 6 నుండి 7 గంటల లోపు మనం మన ఆహారాన్ని ముగించేయాలి.. తొందరగా మనం ఆహారాన్ని ముగించడం వల్ల మనకు ఆయాసం అనేది రాదు.


 సాయంత్రం సమయంలో తినే ఆహారంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటంటే, మొత్తం కూడా పండ్లు మాత్రమే తినాలి. ఆ పండ్లలో అరటి పండును మినహాయించి ఇంకా అన్నీ తినవచ్చు.


 అరటిపండు తినడం వలన మనం బరువు పెరిగే అవకాశం ఉంది. అందుకనే అరటిపండును తినకుండా ఉండడమే మంచిది. అది కాకుండా మనం పండ్లు తినడం వలన మనకు ఆయాసం రాదు.


 మన జీర్ణ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేస్తుంది. రాత్రి సమయంలో తీసుకునే ఆహారంలో పండ్లు తీసుకోవడం వలన మనకు ఉదయాన్నే పదింటి వరకు కూడా ఆకలి వేయదు, ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది.


 తగు జాగ్రత్తలు తీసుకోవడం వలన మీరు తక్కువ సమయంలో మీ బరువును తగ్గించుకో గలుగుతారు, మరియు ఆరోగ్యంగా కూడా ఉంటారు.


ఇవి మాత్రమే కాకుండా ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళలో నిమ్మకాయ రసం మరియు తేనె కలుపుకోవడం వలన కూడా మీరుతొందరగా బరువు తగ్గుతారు. ఇది నా స్వయం అనుభూతి.


 మీరు నాకు ఏమన్నా చెప్పాలి అనుకున్న లేక నన్ను ఏమైనా అడగాలని అనుకున్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.


 ధన్యవాదములు.









 



 

 

 

 

లేబుళ్లు: , , , , ,

7, అక్టోబర్ 2021, గురువారం

మీ అందాన్ని రెట్టింపు చేసుకోవాలా ఐతే ఇలా చేయండి

మీ  అందాన్ని  రెట్టింపు

చేసుకోవాలా ఐతే ఇలా

చేయండి  

పేస్ క్రీమ్స్ రాసిన మీ ముఖం మచ్చలతో అందవిహీనంగా కనిపిస్తుందా,ఏం  చేయాలో తెలియక ఏమీ పాలుపోని స్థితిలో ఉన్నారా, అయితే ఇది మీ కోసమే.

 చాలా మంది యువతులు వారి ముఖం మీద మచ్చలు లేదా మొటిమలు ఉండటం వలన నలుగురిలోకి వెళ్లడానికి అంతగా ఇష్టపడరు. ఇలాంటి వారి కోసం డాక్టర్లు కొన్ని సలహాలుఇస్తున్నారు.

 అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం:

 మన చర్మం అందంగా కనపడాలని మనం రోజు రాసుకునే ఫేస్ క్రీమ్స్ మన చర్మానికి హాని కలగజేస్తాయి అని చెప్తున్నారు.

 ఇవే కాకుండా మనం సన్నగా అందంగా కనబడాలని ఆహారం విషయంలో అశ్రద్ధ చేస్తే ప్రమాదమే అని హెచ్చరిస్తున్నారు. మనకు తెలియకుండానే మనం చాలానే పొరపాట్లను చేస్తాం. వాటి వల్ల మన శరీరం, మన ఆరోగ్యం దెబ్బతినవచ్చు.

 ఆహారంలో తీసుకోవలసిన జాగ్రత్తలు:

 కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని మితంగా తినడం మంచిది. ఇది మాత్రమే కాకుండా పాల ఉత్పత్తులను ఉదాహరణకు స్వీట్స్ మరియు జున్ను మొదలగు పాల పదార్థములను పక్కన పెట్టడం మంచిది.

 ఎక్కువగా ఆకుకూరలను మరియు పండ్లను తినడం వలన అవి మన ఆరోగ్యానికే కాకుండా చర్మ సౌందర్యాని పెంచడంలో కూడా సహాయపడతాయి.

 వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వలన అవి మన చర్మాన్ని అందంగా మరియు ఆరోగ్యంగాఉండటానికి సహాయపడుతాయి.

 అలాగే బయట దొరికే జంక్ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, చక్కెర కలిగిన ప్రార్థనలకు దూరంగా ఉండటం మంచిది.

 

 ఫేస్ క్రీమ్స్ వాడొచ్చా?:

 ఫేస్ క్రీమ్స్ వాడొచ్చా అనే విషయంలో డాక్టర్లు కొన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. అవి ఏంటంటే,

 కొన్ని రకాల మందులను, క్రీమ్ లను మనం ఉపయోగించేటప్పుడు డాక్టర్ యొక్క సలహాలనుతీసుకోవడం మేలు అంటున్నారు.

 ఎందుకనగా వాటిలోని రసాయనాల మన చర్మానికి హాని కలుగజేస్తాయా లేదా అనే విషయాలు డాక్టర్లు మనకు చెప్తారు.ఒకవేళ మనం డాక్టర్లను సంప్రదించకుండా పెంచడం వలన మనం మన చర్మ సౌందర్యాన్ని కోల్పోవచ్చు.

 మన ముఖం పైన వచ్చే మొటిమలనుమనం గిల్ల కోడలు. ఒకవేళ గిల్లి నట్లయితే ఎక్కడ మచ్చలు ఏర్పడతాయి వాటివల్ల మనం మన ముఖ సౌందర్యాన్ని కోల్పోతాం.

 అలాగే వ్యాయామం చేసిన తర్వాత గాని లేదా ఆటలు ఆడిన తర్వాత గాని మనం తప్పనిసరిగా స్నానం చేయాలి. మనం బద్దకించే స్నానం చేయకుండా ఉండకూడదు.

 ఒకవేళ చేయకపోతే చమట వలన ఏర్పడిన బ్యాక్టీరియా చర్మ రంధ్రాలలో చేరి మన చర్మం పైన పొక్కులను మరియు మొటిమలు రావడానికి కారణమవుతుంది.

 అందాన్ని పెంచడం లో నిద్ర చేసే మేలు :

 

 మనం కంటినిండా నిద్ర పోవడం వలన మనం చాలా రకాల ప్రయోజనాలను పొందవచ్చు. అవి ఏమనగా, కంటి నిండా నిద్రపోకపోతే మాన చర్మం ఎంతో ఆరోగ్యంగాఉంటుంది.

 రోజులో కనీసం ఆరు లేదా ఏడు గంటలు నిద్ర పోవాలి ఉంటుంది.ఇలా నిద్ర పోవడం వలన మన చర్మం మరియు ఆరోగ్యం రెండూ బాగుంటాయి.

 

 మనం నిద్ర పోయే ముందు చేయవలసిన పనులు:



  మనం నిద్రపోయే ముందు మన ముఖానికి ఉన్న మేకప్ ను తొలగించాల్సి ఉంటుంది. మన ముఖాన్ని మంచిగా కడుగుకొని శుభ్రంగా ఉంచుకోవాలి.

  లేదంటే మన చర్మం అందవిహీనంగా మారడమే కాకుండా మొటిమలు,మచ్చలు,కళ్ళ కింద నలుపు మొదలగు చర్మ సంబంధిత రోగాలు రావడానికి కారణం అవుతుంది.

  రోజులో కనీసం మనము 6 నుండి 7 గ్లాసుల నీళ్లు తాగాల్సి ఉంటుంది. అతిగా ఎండలో తిరగడం వలన కూడా మన చర్మం ఎంతగానో దెబ్బతింటుంది.

  తప్పనిసరి పరిస్థితులలో బయటకు వెళ్లాల్సి వస్తే అందుకు కావాల్సిన జాగ్రత్తలు తీసుకుని బయటకు వెళ్లండి.

  

 మన జీవితంలో నిద్ర  యొక్క అవసరం:

 

 మన జీవితంలో ఆహారం,నీరు ఎంత ముఖ్యమో అదే విధంగా నిద్ర అనేది కూడా అంతే ముఖ్యం.

 మన జీవితంలోసగం జీవితకాలం నిద్ర లోనే గడుపుతారు.

 మనిషి తమ జీవితంలో నీరు తాగకుండా ఆరు రోజులు మరియు ఆహారం తీసుకోకుండా 25 రోజులు ఉండగలరు అంట.

  కానీ నిద్రపోకుండా ఆరు నుండి ఏడు రోజులు మాత్రమే. ఇక్కడే అర్థమైపోతుంది మన జీవితంలో ఆహారం లేకపోయినా ఉండగలం గాని నిద్ర లేకపోతే మాత్రం మనం ఉండలేము.

  ఈ రోజుల్లో చాలా మందిఫోన్ లకు అలవాటు పడి పోయే నిద్రను మర్చిపోతున్నారు.అలాంటి వారు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు.

  

  మనిషికి నిద్ర యొక్క అవసరం:

  

  మనిషికి సరైన నిద్ర లేకపోవడం వలన ఆరోగ్యం క్షీణించడమే కాకుండా తమ రోజంతా ఎంతో చిరాకు పరాకు లతో ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా తమ ముఖ సౌందర్యాన్ని కూడా తగ్గిస్తుంది.కళ్ళ కింద నలుపు రావడానికి కూడా ఇది ఒక కారణం.

  వయసును బట్టి నిద్ర :

 మనిషి తమ వయసును బట్టి నిద్ర అనేది ఉంటుంది.

 నవజాత శిశువులకు రోజుకి 14 నుండి 17 గంటల వరకు నిద్ర అవసరం.

 12 నెలల పిల్లలకు రాత్రులు 10 గంటలు

 మరియు పగలు నాలుగు గంటల నిద్ర అవసరం.

 రెండు సంవత్సరాల పిల్లలకు రాత్రి 11 నుండి 12 గంటల నిద్ర అవసరం మరియు పగలు ఒకటి నుండి రెండు గంటల నిద్ర అవసరం.

 మూడు నుండి ఐదు సంవత్సరాలు గల పిల్లలకు పది నుండి 13 గంటల నిద్ర అవసరం.

 6 నుండి 13 సంవత్సరాల పిల్లలకు9 నుండి 11 గంటల నిద్ర అవసరం.

 14 నుండి 17 సంవత్సరాలు వయసు గలవారు8 నుండి 10 గంటలు నిద్ర అవసరం.

 18 సంవత్సరముల నుండి పైబడినవారు రోజుకి 7 నుండి 9 గంటలునిద్ర అవసరం.

 ఇలా మనకు ఎంత నిద్ర అవసరమో అంత నిద్ర నిద్ర పోవడం వలన మన అందాన్ని మరియు ఆరోగ్యాన్ని రెండింటినీ కూడా కాపాడుకోవచ్చు అనడంలో సందేహం లేదు. మీరు కూడా అందాన్ని మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకుంటే క్రమం తప్పకుండా వీటిని పాటించండి.

 

 అందాన్ని పెంచడంలో నిద్ర యొక్క పాత్ర:

 

 నిద్రకి,ఆరోగ్యానికి,అందానికి ఈ మూడింటికి చాలా దగ్గర సంబంధం ఉంది.తగినంత నిద్ర పోవడం వలనలేక మనము ఎంతో అలసటగా మరియు అందవిహీనంగా కనిపిస్తాము.

 మనము కంటినిండా నిద్ర పోవడం వలన మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది ఇవి మాత్రమే కాకుండా మన అందాన్ని రెట్టింపు చేస్తుంది.

 ఇది ఎలా జరుగుతుంది అనుకుంటున్నారా?

 మనం నిద్రపోయే సమయంలో మన శరీరం లోపల ఎన్నో కణాలు కొత్తగా పుడతాయి. అవి అలా పుట్టడం వలన మన ముఖం లో కొత్త కాంతి వస్తుంది.


 బాగా నిద్ర పోవడం వలన మన  రోజుని ఎంతో ఆనందంగా మొదలుపెట్టవచ్చు.మనం చేసే పనిలో కూడా పూర్తిగా శ్రద్ధ వహించి చేస్తాము. మనము మన రోజుని ఎంత ఉల్లాసంగా మరియు ఉత్సాహంగా గడపడం లో నిద్ర ఎంతగానో సహాయపడుతుంది.

 

 నిద్ర లేకపోవడంవల్ల కలిగే నష్టాలు.

 

 సరైన నిద్ర లేకపోవడం అనేది మన జీవితంలో ప్రతి దాని మీద కూడా ప్రభావం చూపిస్తోంది. నిద్ర లేకపోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం.

 

 1. మన ఆరోగ్యం క్షీణిస్తోంది.

 2. మన అందంతగ్గిపోతుంది.

 3. డిప్రెషన్.

 4. బరువు పెరగడం.

 5. విసుగు వస్తుంది.

 6. చేసే పని మీద ఇంట్రెస్ట్ ఉండదు.

 7. ప్రతి ఒక్కరి మీద చిరాకు పడటం.

 8. చాలా తొందరగా కోపం తెచ్చుకోవడం.

 9. మైండ్ సరిగా ఉండకపోవడం.

 10. జ్ఞాపకశక్తి తగ్గడం.

 11. సమస్యలను పరిష్కరించుకో లేకపోవడం.

 12. వాహనం నడిపే సమయంలో యాక్సిడెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది.

 13. శారీరక,మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

 14. మన పనిని కూడా చేసుకోలేకపోవడం.

 15. త్వరగా వయసు క్షీణించడం.

 

  ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే సమస్యలు వస్తాయి. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి అన్నా మన అందాన్ని మనం రక్షించుకోవాలి అన్న మనం కంట్రీ నిండా నిద్ర పోవడం అనేది చాలా అవసరంఅనేది మనకు అర్థమవుతుంది.

  నిద్ర పక్కనపెట్టి ఫోను చూసుకోవడం టీవీలు చూడటం ఇలాంటివి చేయడం వలన మన ఆరోగ్యాన్ని మన అందాన్ని మనమే మన చేతులారానాశనం చేసుకుంటున్నాం.

  తెలుసుకున్నారు కదా నిద్ర వల్ల కలిగే లాభాలు, కష్టాలు. ఇక మీ అందం మీ ఆరోగ్యంమీ చేతుల్లోనే.

  మీరు ఎమన్నా రసాయానాలు కలిసిన వాటిని వడలి అనుకుంటే డాక్టర్స్ ను అడిగి వాడవచ్చు.

  మీరు నాకు ఏమన్నా చెప్పాలి అనుకున్న లేదా ఏమని అడగాలి అనుకున్నా కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు.

  ధన్యవాదములు.

  

 

 


 

  

 

 

 

 

 

 

  

  

  

  

  

  

 

లేబుళ్లు: , , , , , , ,

6, అక్టోబర్ 2021, బుధవారం

మీ చర్మంను మరియు మీ జుట్టును కాపాడుకోవడంలో అరటి చేసే మేలు

 మీ చర్మంను మరియు    మీ

జుట్టును కాపాడుకోవడంలో

 అరటి చేసే మేలు



చాలా మంది జీవితంలో అరటి పండును తినడానికి ఎంతగానో ఇష్టపడతారు. అరటి పండులో ఉండే విటమిన్స్ మరియు మినరల్స్ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మరియు మా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది.

 అరటి పండులో ఉండే పోషక విలువలు మన జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇది మాత్రమే కాకుండా మన చర్మాన్ని కాంతివంతంగా చేయడంలోనూ ఎంతో సహాయపడుతుంది.అరటి పండు గురించిఎంత తీసుకున్న తక్కువే.

 అరటిపండు వల్ల నే కాకుండాఅరటి తొక్క వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి.అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

 అరటిపండు ప్యాక్ వేసుకోవడం వలన మీ ముఖము ఎంతగానో కాంతివంతంగా తయారవుతుంది. అరటి పండులో విటమిన్ ఏ ఉండటం వలన అది మీ చర్మాన్ని మరింతగా రక్షిస్తుంది.

 ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించడం ద్వారా మన చర్మం యొక్క సాగే గుణాన్నిమెరుగు పరుస్తుంది.ఇది మాత్రమే కాకుండా సూర్యుని నుండి వెలువడే అతినీలలోహిత కిరణాల వలన మన చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది.

 అరటి పండు వలన ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలానే ఉపయోగాలు ఉన్నాయి,అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

 అరటిపండు ప్యాక్ వేసుకోవడం వలన మన చర్మంముడతలు పడకుండా కాపాడుతుంది.అరటిలో ఉండే హైడ్రేటింగ్ ఏజెంట్లు మీ మాడుని తేమ  గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

 ఇలా తేమ గా ఉండడం వలన మీ జుట్టు ఎంతో ఆరోగ్యంగా మరియు మృదువుగా ఉంటుంది.

 మీ జుట్టు మరియు మీ చర్మం కి సంబంధించిన అనేక రకాల సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి అరటిపండు ఎంతగానో ఉపయోగపడుతుంది.

 అరటి పండు తో చేసే ప్యాక్ లు వేసుకోవడం వలన మీ చర్మాన్ని ముడతలు పడకుండా మరియు మొటిమలను తగ్గించుకోవడం లో కూడా సహాయపడుతుంది.మీ జుట్టు చివర ఏర్పడిన పగుళ్ల నుండి మరియు అనేక రకాల జుట్టు సమస్యల నుండి రక్షిస్తుంది.

 మెరిసే చర్మం కోసం:

 అరటి తో చేసే ప్యాక్ లు వేసుకోవడం వలన మీ చర్మం ముడతలు పడకుండా మరియు మచ్చలను నుండి విముక్తి పొందడానికిమరియు డార్క్ స్పాట్స్ పోవడానికి కూడా సహాయపడుతుంది.

 కావలసిన పదార్థాలు:

 1.  అరటి పండు

 2. ఒక టీ స్పూన్ తేనె

 తయారీ విధానం:

 అరటి పండు ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిమిక్సీలో వేసి మిశ్రమం గా చేయాలి.ఇలా తయారైన మిశ్రమంలో  ఒక టీ స్పూన్ తేనెను వేసి మొత్తం కలిసేలాబాగా కలపాలి.

 ఇలా తయారైన మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఒక పదిహేను నిమిషాల పాటు విడిచిపెట్టాలి.ఇలా చేయడం వలన మన చర్మం పైన ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ పోవడంలో మరియు ముడతలు రాకుండా ఉండడంలో మరియు మచ్చలను పోగొట్టడంలో ఎంతో పాత్ర వహిస్తుంది.

 పదిహేను నిమిషములు పూర్తయిన తరువాత మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.ఇలా చేయడం వలన మీ ముఖము ఎంతో కాంతివంతంగా, ప్రకాశవంతంగా ఉంటుంది.

 మొటిమలను నిర్మూలించడంలో అరటి యొక్క పాత్ర:

 కావలసిన పదార్థాలు:

 1.  అరటి పండు 1

 2. ఒక టీ స్పూన్ నిమ్మరసం

 3. ఒక టీ స్పూన్ తేనె

 తయారు చేసే విధానం:

 ముందుగా అరటిపండుని ముక్కలుగా చేసి ఒక మిశ్రమంలాతయారు చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమంలో ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని మరియు ఒక టీస్పూన్ తేనే వేసి బాగా కలపాలి.

 ఇలా కలిపిన మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకునే 30 నిమిషముల వరకు ఆరానివ్వాలి.ఆ తర్వాత మీ ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రంగా కడుగుకోవాలి.

 మంచి ఫలితాల కోసం ఈ ప్యాక్ ను వారానికి కనీసం రెండు సార్లయినా రాసుకోవాలి. ఇలా రాసుకోవడం వలన మీ ముఖంలో మార్పులు కనిపిస్తాయి.

 పొడిబారిన చర్మం నుండి రక్షణ పొందడానికి:

 అరటిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వలన మీరుఎంతో ఆరోగ్యవంతమైన చర్మాన్ని పొందవచ్చు.

కావలిసిన పదార్ధములు :

 1. సగం అరటి పండు

 2. ఒక టీస్పూన్ ఓట్మెల్

 3. ఒక టీ స్పూన్ తేనె

 4. ఒక టీస్పూన్ గుడ్డు లోని పచ్చసొన

 తయారు చేసుకునే విధానం:

 ముందుగా అరటిపండుని మెత్తని మిశ్రమంలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఓట్మెల్ శుభ్రం చేసుకుని మెత్తని పొడి ఎలాతీసుకుని పక్కన పెట్టుకోవాలి.

 ఇప్పుడు పక్కన పెట్టుకున్న అరటి మిశ్రమంలో మనం తయారుచేసుకున్న పొడినే వేసి బాగాకలుపుకోవాలి.మనం తయారుచేసుకున్న ఈ మిశ్రమంలో ఇప్పుడు ఒక టీ స్పూన్ తేనెను మరియు ఒక టీస్పూన్గుడ్డులోని పచ్చసొనను వేసి బాగా కలుపుకోవాలి.

 ఇలా తయారుచేసిన మిశ్రమంను మీ ముఖానికి నేరుగా రాసుకోవచ్చు. ఇలా రాసుకున్నా క ఒక పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి.

 15 నిమిషాములు పూర్తయిన తర్వాతమీ ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోవాలి.ఆ తర్వాత మీ ముఖాన్నిబాగా ఆరనివ్వాలి.

 మెరుగైన ఫలితాల కోసం ఈ చిట్కా ను వారంలో కనీసం రెండు సార్లు వేసుకోవచ్చు.

 దృఢమైన కేశాల కోసం:

 కావలసిన పదార్థాలు:

 1.  ఒకటి నుండి రెండు అరటి పండ్లు( బాగా ముగ్గిన వి)

 2. ఒక టేబుల్ స్పూన్ తేనె.

 తయారు చేసుకునే విధానం:

 అరటి పండ్ల గుజ్జును సేకరించాలి. ఇలా సేకరించిన గుజ్జులో ఒక టేబుల్ స్పున్ తేనె వేసి బాగా కలుపుకోవాలి.

 నా కలుపుకున్న మిశ్రమంను మీ కేశాలకు రాసుకునే 30 నిమిషముల వరకు వదిలేయాలి. 30 నిమిషాలు పూర్తయిన తర్వాత తల స్నానం చేయాలి.

 మెరుగైన ఫలితాలను పొందడానికి ఈ చిట్కాను వారానికి ఒకసారి పాటించడం వలన వచ్చిన ఫలితాలను మీరు చూడవచ్చు.

 జుట్టు చిగుళ్ల పగుళ్ళ నుండి విముక్తిని పొందడానికి:

 అరటి పండులో ఉండే విటమిన్స్ A,C,E ఇవి మాత్రమే కాకుండా ఎన్నో రకాలైన మినరల్స్ ఉండడం వలన అరటిపండు మన మాడును తేమగా ఉంచడం మాత్రమే కాకుండా జుట్టు చివర్లకు ఏర్పడే పగుళ్ళ నుండి గూడా మన కేశాలకు రక్షణ ఇస్తుంది.

 కావలసిన పదార్థాలు:

 1.  బాగా ముగ్గిన అరటి పండు 1

 2. 2టేబుల్ స్పూన్ల పెరుగు

 3. రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్

 తయారు చేసుకునే విధానం:

 అరటి పండ్ల నుండి అరటి గుజ్జును సేకరించాలి.ఇలా సేకరించిన గుజ్జును ఒక చిక్కని మిశ్రమంలా తయారు చేసుకోవాలి.

 ఈ చిక్కని మిశ్రమం లో రెండు స్పూన్ల రోజ్ వాటర్ ని మరియు రెండు టేబుల్ స్పూన్ల పెరుగును కలిపి ఒక మిశ్రమం లా తయారు చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మీ తలకు రాసుకోవాలి. ఒక గంట పాటు మీ జుట్టును వదిలేయండి.

 షవర్ క్యాప్ ఉపయోగించి మీ జుట్టును గంటపాటు ఆరనివ్వాలి.ఆరిన తర్వాత మీ షాంపుతో తల స్నానం చేయండి.

 ఈ చిట్కా నీ వారంలో ఒకసారి పాటించడం వలన మంచి ఫలితాలు పొందుతారు.

మీకు ఏమైనా సందేహాలు వున్నా యెడల కామెంట్ రూపం లో అడగగలరు. మరియు మీకు నాకు ఎమన్నా చెప్పాలి అనుకున్న కామెంట్స్ రూపం లో చెప్పగలరు.

ధన్యవాదములు.


లేబుళ్లు: , , ,

5, అక్టోబర్ 2021, మంగళవారం

గ్రేట్ బ్యూటీ విత్ గ్రేప్ జ్యూస్

 గ్రేట్ బ్యూటీ విత్ గ్రేప్ జ్యూస్

చాలామంది ఆడపిల్లల హ్యాండ్ బ్యాగ్ లో లిప్స్టిక్, మాయిశ్చరైజర్, ఫెయిర్నెస్ క్రీమ్ మొదలగు సౌందర్య ఉత్పత్తులు ఉంటాయి.

 కానీ అవన్నీ మానవ శరీరానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో చర్మానికి హాని కలుగజేస్తాయి.
 
 చర్మ నిపుణులు కూడా ఇదే చెప్తున్నారు.
 
 అందుకుగాను ప్రకృతి అందిస్తున్న సహజ వనరులతోనే మన శరీరాన్ని కాపాడుకోవాలి.
 
 ఈ విధంగా చేయడం వలన....
 మనము అందాన్ని మరియు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.
 

 ద్రాక్షతో ఆరోగ్యమే కాదు అందాన్ని కూడా పెంచుకోవచ్చు.

 

 ద్రాక్షా లోని పోషకాలు:

 
 పొటాషియం, క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలు  సమృద్ధిగా ఉంటాయి.ద్రాక్షలో వివిధ రకమైన పోషకాలు ఉండడం వలన అవి మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా మన చర్మానికి సౌందర్యాన్ని చేకూరుస్తాయి.
 
 ఇంతే కాకుండా ద్రాక్ష రసాన్ని తీసుకోవడం వలన జలుబు,ఫ్లూ, దగ్గు మొదలగు వాటి నుండి విముక్తి పొందవచ్చు.
 
 100 గ్రాముల ద్రాక్ష నుంచి 69 క్యాలరీల శక్తి అందితే కొలెస్ట్రాల్ జీరో శాతానికి తగ్గుతుంది అంటున్నారు నిపుణులు.
 
 పైగా ద్రాక్షలో విటమిన్ సి ఉండడం వలన అది మన శరీర సౌందర్య అభివృద్ధికి ఎంతగానోదోహద పడుతుందని చెబుతున్నారు నిపుణులు.
 

 క్లెన్సింగ్ మాస్క్:

 
 మీ ముఖానికి ద్రాక్ష మాస్క్ వేసుకోవడం వలన మీ ముఖము ఎంతో కాంతివంతంగా ఎంతో ప్రకాశవంతంగా మారుతుంది.
 
 ఈ క్లెన్సింగ్ మాస్క్ అనేది పొడిబారిన చర్మానికి,నార్మల్ చర్మానికి,సున్నితమైన చర్మానికి ఇలా అన్ని రకాల చర్మాలకు అనుకూలంగానే ఉంటుంది.
 
 ద్రాక్షారసం యాంటీ ఆక్సిడెంట్స్ లకు ప్రసిద్ధి చెందింది.
 దీనివలన మీ చర్మం పై పేరుకున్న మలినాలను ఇది శుభ్రపరుస్తుంది.
 
 ప్లేట్లెట్లు పెంచడానికి మరియు మీ చర్మాన్ని తాజాగా ఉంచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

 సూర్యరశ్మి నుండి రక్షణ పొందడానికి:


 ద్రాక్ష రసం లో ఫ్లవనోయిడ్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
 
 మీ చర్మానికి నష్టం కలగకుండా ఉండడానికి మరియు అతినీలలోహిత కిరణాల నుండి రక్షణ పొందడానికి ద్రాక్ష రసం ఎంతగానో దోహదపడుతుంది.

 మీ చర్మానికి ద్రాక్షరసం రాసినప్పుడు సూర్యకిరణాల నుండి తప్పించుకుని చల్ల గా ఉండడానికి ఎంతగానో సహాయపడుతుంది.

 మీరు కనుక సున్నితమైన చర్మాన్ని కలిగి ఉంటే ద్రాక్ష రసం తో నయం చేసుకోవచ్చు.

 సూర్యకిరణాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ద్రాక్ష రసం ఎంతగానో సహాయపడుతుంది.

 కళ్ళకు చేసే మేలు:


 కళ్ళ కింద ఉండే నల్లటి వలయాలను తొలగించడం లో ద్రాక్ష ఎంతగానో మేలు చేస్తుంది.
 
 కళ్ళ కింద నల్లటి వలయాలు ఉన్నవారు గింజలు లేని ద్రాక్షను కోసి కనురెప్పల పైన ఉంచితే మీ కళ్ళ చుట్టూ ఉన్న నల్లటి వలయాలను తొలగించడమే కాక కళ్ళ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని మెరుగుపరుస్తుంది.

 పొడి చర్మానికి ద్రాక్ష చేసే మేలు:


 ఒక స్పూన్ ద్రాక్ష రసం మరియు గుడ్డు యొక్క తెల్లని సొన కలిపి మీ ముఖానికి రాసుకుని పది నిమిషాలు వదిలేయండి.

 పది నిమిషాల తర్వాత మీ ముఖాన్ని కడగండి.
ఇలా చేయడం వలన మీ చర్మం ఎంతో సున్నితంగా, మృదువుగా తయారవుతుంది.

 చర్మంను తేమగా ఉంచడంలో ద్రాక్ష యొక్క పాత్ర:


 ద్రాక్ష చేసే మంచి అంతో ఇంతో కాదు, ద్రాక్ష రసం మన అందాన్ని పెంచడమే కాక మన చర్మానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది.

 ద్రాక్ష రసం లో మన చర్మానికి ఎలా ఉపయోగించాలో కూడా మనం తెలుసుకోవాలి.ఒక స్పూన్ ద్రాక్ష రసంను మన చర్మానికి రాసి పదిహేను నిమిషాలు వదిలేయాలి.

 పదిహేను నిమిషాల తర్వాత మన చర్మంను  గోరువెచ్చని నీళ్ళతో కడుగు కోవడం వలన చర్మం తేమగా ఉంటుంది.

 వయసును తగ్గించే ద్రాక్ష:


 నిజానికి ద్రాక్ష వయస్సును తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.మీరు మీ చర్మం పైన ద్రాక్ష రసం వంటకాలను రాసుకోవడం వలన మీ చర్మం పైన ఎక్స్ ఫ్లాట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

 ఈ ప్రక్రియ వలన చర్మంపైన ఉన్న డెడ్ స్కిన్ సేల్స్ ను తొలగిస్తుంది.అంతేకాకుండా రక్తప్రసరణను పెంచడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది.

 మరియు ముడతలను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది.మీ చర్మం హైడ్రేట్ అయినప్పుడు ద్రాక్షరసం తాగటం వలన మీ చర్మం తేమగా ఉంటుంది.

మీరు నాకు ఎమన్నా చెప్పాలి అనుకున్న లేక నన్ను ఏమన్నా అడగాలి అనుకున కామెంట్ బాక్స్ లో అనగలరు.

ధన్యవాదములు.




లేబుళ్లు:

4, అక్టోబర్ 2021, సోమవారం

చర్మం నల్లబడుతుందా? అయితే ఇలా చెయ్యండి

చర్మం నల్లబడుతుందా?

అయితే   ఇలా  చెయ్యండి...

 కొంతమందికి శరీరం లో వివిధ భాగాలలో చర్మం నల్ల బడుతు వుంటుంది .

మరి ముఖ్యం గా ఎండ వేడి తగిలే ప్రాంతం లో ఇది మరీ స్పష్టం గా కనిపిస్తుంది. 

ఎండ లోకి వెళ్తే చాలు చర్మం పై మంట పుడుతుంది. ఎండ తాకిన ప్రాంతం నల్ల బడుతుంది. 

కొంత మందికి చర్మం పై నల్ల మచ్చలు ఏర్పడతాయి. ఈ విధమైన సమస్యలను పిగ్మింటేషన్ సమస్యలు గా చెప్తారు
హార్మోన్ల సమస్యల వల్ల, థైరాయిడ్ సంబంధిత సమస్య లు , ఈ మధ్య కాలంలో వాడుతున్న మెడిసిన్ వల్ల శిరోజాలకు క్రమం తప్పకుండా రంగు వేసుకునే వారికి ఈ విధమైన పిగమింటేషన్ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. 

సూర్యుడి అతి నీల లోహత కిరణాల వల్ల ఇంక ఎ ప్రత్క్కువ అయ్యే అవకాశం వుంది. ఈ సమస్యలు వచ్చిన తర్వాత తగు జాగ్రత్తలు తీసుకునే కంటే ముందే జాగ్రత్తలు తీసుకోవడం మేలు. 
ఆరంభ దశలోనే ఈ సమస్యలను గుర్తిస్తే పరిష్కారం కూడా సులువే అవుతుంది.

     కొన్ని చిట్కాలు...

  *మంచి నీళ్ళు ఎక్కువ గా తాగాలి.
  
*తాజా పండ్లు తినాలి 
 
 *తాజా పండ్ల రసాలు తాగాలి.
 
 *మజ్జిగ ఎక్కువగా తాగాలి.
 
 *నల్ల ద్రాక్ష, పుచ్చకాయ, దానిమ్మ పండ్లను తినాలి.
  
*బయటకి వెళ్ళడానికి ముప్పై నిమిషాల ముందు సన్స్క్రీన్ లోషన్ ను ముఖానికి రాసుకోవాలి.
  
*నల్ల ద్రాక్ష గుజ్జుకి కొంచెం తేనె కలిపి ప్రతి రోజు స్నానానికి ఇరవై నిమిషాల ముందు మొఖానికి రాసుకుని ఆ తర్వాత చల్లని నీళ్ళతో స్నానం చేయాలి.
  
*కొంచెం క్యారెట్, క్యాబేజ్ ఇంక కొంచెం ఓట్స్ కలిపి మిక్సీ లో వేసి పేస్ట్ చేసి దానిలో కొంచెం పాల మీగడ సగం చెంచా తేనె మూడు చెంచాల నిమ్మరసం కలిపి ముానికి రాసుకోవాలి.
 
 *ఇరవై నిమిషాల తర్వత కొంచెం గోరు వెచ్చని నీటితో మొఖాన్ని కడుక్కోవాలి.
 
 *ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖం పై నల్లటి మచ్చలు క్రమం గా తగ్గుతాయి.
 
 *పిగమంటేషన్ సమస్య ఉన్నవారు ఎండలో బయటకు వెళ్లి వాస్తే ముఖం కడుక్కుని కీరా ను గుండ్రంగా ముక్కలుగా కోసి ముఖం పై ఇరవై నిమిషాలు పాటు వుంచుకుని రిలాక్స్ అవ్వాలి.
  
*ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

 మీ కోసం ఒక చిట్కా :

చర్మం నల్లబడుతుంటే ఇలా చేయండి.
 రెండు నాటు టమాటాలను తీసుకోండి.వాటిని మిక్సీ పట్టండి బాగా మెత్తగా అయ్యేలా చూసుకోండి.అలా మెత్తగా అయిన మిశ్రమంలో రెండు లేదా మూడు స్పూన్ల తేనె ను కలపండి.

 అలా కలిపిన మిశ్రమం మీకు ఎక్కడైతే చర్మం నల్లగా ఉందో అక్కడ ఆ మిశ్రమాన్ని రాయండి. ఇలా రాసిన ఇరవై నిమిషాల తర్వాత మీరు మీ చర్మాన్ని శుభ్రపరుకోండి.

 ఈ చిట్కా వల్ల లాభాలు:


 టమాటా లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అది మన చర్మం ప్రకాశించడం లో సహాయ పడుతుందని నిపుణులు చెబుతున్నారు . అంతేకాకుండా దీనిలో క్లీనింగ్ ఎజెంట్స్ కూడా బాగానే ఉంటాయి. దాని వలన మన చర్మం పైన పేరుకుపోయిన మట్టిని తొలగించడంలో సహాయపడుతుంది. 

 ఇంకా తేనే విషయానికి వస్తే తేనెలో డెడ్ స్కిన్ సెల్స్ ని పోగొట్టే శక్తి ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా ఇది కూడా మన చర్మాన్ని క్లీన్ చేస్తుంది అనడంలో సందేహం లేదు.

 మీరు నన్ను ఏమైనా అడగాలి అనుకున్నా లేక నాకు ఏమైనా చెప్పాలి అనుకున్న కామెంట్స్ రూపంలో ఆడగలరు చెప్పగలరు.

ధన్యవాదములు.



 
  

లేబుళ్లు: ,