దృఢమైన కురుల కోసం ఈ ఒక్కటి
దృదమైన కురుల కోసం
ఈ ఒక్కటి
మనం అందంగా కనబడుతున్నాము అంటే దానిలో మొహం పాత్ర మాత్రమే కాకుండా మన జుట్టు చాలా పాత్ర వహిస్తుంది. మనం అందంగా కనిపించడానికి రకరకాల హెయిర్ స్టైల్స్ వేసుకుంటాం.
అస్సలు మనకు జుట్టు ఎందుకు వుండుతుంది. అస్సలు కారణం ఏంటి, జుట్టు తిరిగి మాములుగా పెరగాలి అంటే ఎం చెయ్యాలి, ఎం వాడాలి, ఏలాంటి విటమిన్స్ కావాలి అనే వాటి గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం.
మీ కురులు బలంగా,చక్కగా, ఒత్తుగా పెరగాలి అని మీరు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తుంటారు.అలా చేసే ప్రయత్నంలో మీరు చాలా కేమికల్స్ కలిసిన వాటిని వాడే ఉంటారు. వాటిలో మీకు కొన్ని పని చేస్తాయి మరి కొన్ని మరి కొన్ని ప్రయత్నాలు విఫలం అవుతాయి.
ఇలాంటి ప్రయత్నాలు చేసే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.వాటిలో కొన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.
ముందుగా మాన కేశాలకు ఎలాంటి విటమిన్స్ కావాలి,ఎలాంటి ప్రోటీన్స్ అవసరం,ఎలాంటి పోషక ఆహరం తెస్కుంటే మంచిది,ఏమి వాడితే కేశాలు చక్కగా, ఒత్తుగా,బలంగా పెరుగుతాయి తెలుసుకుందాం.
ముందుగా మనం కెమికల్స్ కలిసిన వాటిని వాడటం మానేయాలి. అలాంటి వాటిని వాడటం వలన మనకు కొత్త జుట్టు రావడం ఏమోగానీ ఉన్న జుట్టు ఊడిపోవటం కాయం.
కాబట్టి మనం కెమికల్స్ కలిసిన వాటికి దూరంగా ఉండటం మంచిది మరియు ప్రకృతి మనకు ప్రసాదించిన వాటితోనే మన కేశాలను దృఢంగా మరియు ఒత్తుగా, అందంగా ఎలా మార్చుకోవాలి మరియు ఎలాంటి వనరులను ఉపయోగించుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
కొబ్బరి నూనె మరియు అలోవెరా :
కొబ్బరి నూనె అనేది ప్రాచీన భారతదేశ కాలం నుండి ఇప్పటి వరకు ఎంతో మంచి నూనె గా పేరు పొందింది. దీనిని మన పూర్వీకులు కూడా ఉపయోగించారు. మన పూర్వీకులు జుట్టు ఇప్పుడున్న మన జుట్టు రెండింటినీ కూడా పక్కనపెట్టి చూసుకుంటే మనకు ఎంతో తేడా కనిపిస్తుంది.
ఆ తేడా ఎందుకు ఉన్నది అనేది ఆలోచిస్తే మనకు చాలా తేడాలు కనిపిస్తాయి. ఉదాహరణకు అప్పుడు ఉన్న వాతావరణం, అప్పుడు ఉన్న కాలుష్యం ఇలా చెప్పుకుంటూ పోతే మనకు చాలానే తేడాలు కనిపిస్తాయి.
ఇక ఇప్పుడు ఉన్న వాతావరణం, బాగా పెరిగిపోతున్న కాలుష్యం, ప్రతి దానిలో కూడా కెమికల్స్ కలవడం సహజమైపోయింది. అంతెందుకు మనం పీల్చే గాలి కూడా కాలుష్యం అయిపోయింది. గాలిలో కూడా చాలానే కెమికల్ కలుస్తున్నాయి అనడంలో తప్పులేదు అనిపిస్తుంది..
ఇంకా అలోవెరా విషయాన్ని వస్తే అలోవెరా లో మన జుట్టుకి ఎంతో అవసరమైన విటమిన్ ఈ అనేది అలోవెరా లో ఉంటుంది. దీని వాళ్ళ మన జుట్టు కు అవసరం అయినా పోషకాలు లభిస్తున్నాయి అనడం లో తప్పు లేదు.
విటమిన్ ఈ అనేది మన జుట్టు వుండకుండా ఉండడటానికి మరియు చివర్లు చిట్లకుండా ఉండడానికి తొడ్పాడుతుంది . అదే విధం గా అలోవెరా లో కొబ్బరి నూనె ని కలిపి రాసుకోవడం వాళ్ళ మన జుట్టు కు చాలా మంచిగా పనిచేస్తుంది..
అలోవెరా లో కొబ్బరి నూనె కలిపి రాసుకోవడం వల్ల మన జుట్టు కు విటమిన్ ఈ అందడమే కాకుండా కొబ్బరి నూనె మన జుట్టు ను తేమగ ఉండేలా చేస్తుంది.
ఇలా మన జుట్టు తేమగ ఉండటం వలన మన జుట్టు తేమగ ఉండటం లోనే కాకుండా తలనొప్పి రాకుండా చేయడంలో కూడా సహాయపడుతుంది.
తయారు చేసుకునే విధానం:
ముందుగా అలోవెరా మొక్క నుండి అలోవెరా ను కట్ చేస్కుని తీసుకోవాలి. అలా తీసుకున్న అలోవెరా ను శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న అలోవేరా ను ఉండగా అంచులను తొలగించాలి. అలా తొలగించిన అలోవెరా ను పైన పొరాను చాకు సహాయం తో తొలగించాలి.
అలా తొలగించిన తర్వాత అలోవెరా లోని కండను నాకు సహాయం తోనో తీయాలి లేక ఫోన్ సహాయం తోనో మెల్లిగా తీయాలి. అలా తీసిన కండను మిక్సీ గిన్నెలో వేసుకుని మిక్సీ పట్టాలి.
అలోవేరా లోని కండ పూర్తిగా మెత్తగా అయ్యేలా చూసుకోవాలి. మెత్తగా అయిన పేస్టును ఒక గిన్నెలోకి తీసుకుని, దానిలో ఒక స్పూన్ కొబ్బరి నూనె కలిపి మెత్తగా అయ్యేలా చూసుకోవాలి.
ఇలా మనం తయారు చేసుకున్న పేస్టు ని ముందుగా మన జుట్టు కుదుళ్లకు బాగా పట్టించుకోవాలి. అలా పట్టించు కోవడం వలన మన కుదుళ్ళ లో కి ఆ మిశ్రమం బాగా పడుతుంది.
అలా పట్టడం వలన మన కేశాలకు కావలసిన విటమిన్ ఈ అనేది సమృద్ధిగా లభిస్తుంది. ఇలా లభించడం వలన మన కేశాలు బలంగా మరియు ఒత్తుగా తయారవుతాయి.
ఇలా పట్టించుకున్న 30 నిమిషాల తర్వాత మనం తల స్నానం చేయడం వలన మంచి ఫలితన్ని మనం పొందావచ్చు. ఇలా వారానికి ఒకసారి చేయడం కలిగే మార్పులను మీరే గమనించవచ్చు.
జుట్టు రావడానికి గల కారణాలు:
జుట్టు రాలడానికి చాలానే కారణాలు ఉంటాయి. వాతావరణం లో జరిగే మార్పులు, కాలుష్యం ఎక్కువగా పెరిగిపోవడం,మనలో జుట్టు పెరగడానికి ఎలా విటమిన్స్ తక్కువగా ఉండడం, మన శరీరం లో సరిపడా నీటి శాతం లేకపోవడం వలన కూడా జుట్టు ఊడుతుంది.
మనం తినే ఆహారంలో విటమిన్ తక్కువగా ఉండడం వలన కూడా జుట్టు ఊడుతుంది. ఇవి మాత్రమే కాకుండా, మనం మానసికంగా సమస్యలను ఎదుర్కొనే సమయంలో కూడా జుట్టు రాలిపోవడం మీరు గమనించవచ్చు.
జుట్టు రాలడానికి మీరు చేసే జాబ్ కూడా ఒక కారణం అవ్వచ్చు. ఉదాహరణకు మీరు కంప్యూటర్ వర్క్ చేసే వారైతే మీ కళ్ళు ఎప్పుడూ కూడా స్క్రీన్ చూడటం మీదే ఉంటాయి.
అలా ఎక్కువ సేపు స్క్రీన్ ని చూడటం వలన మన కళ్ళు దెబ్బతింటాయి. కళ్ళు దెబ్బ తినడం వలన తల నొప్పి తప్పకుండా వస్తుంది. తలనొప్పి రావడం వలన జుట్టు ఊడటానికి కూడా కారణమౌతుంది.
ఇదే విధంగా చాలా రకాలుగా మనం చేసే జాబ్ కూడా మన జుట్టు ఉండడానికి ఒక కారణం అవుతుంది.
తీసుకోవలసిన జాగ్రత్తలు:
మనం తినే ఆహారంలో జుట్టు పెరగడానికి అవసరమయ్యే పోషకాలు ఉండేలా చూసుకోవాలి. మనం ఉండే వాతావరణం కూడా మనకు తగ్గట్టుగా ఉందో లేదో అనేది కూడా గమనించాలి.
బయటికి వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి. గాలిలో కాలుష్యం ఎక్కువగా పెరగడం వలన గాలి ద్వారా దుమ్ము అనేది మన తల లోకి వచ్చి చేరుతుంది.
అలా చేరకుండా ఉండేలా మనం జాగ్రత్త పడాలి. తనకి వారంలో కనీసం నాలుగు సార్లు అయినా నూనె పెట్టడం మంచిది. నూనె పెట్టడం వలన మన జుట్టు తెమగ గా ఉండడమే కాకుండా మనకు తలనొప్పి రాకుండా ఉండడం లో కూడా సహాయపడుతుంది.
ముఖ్యంగా కెమికల్స్ కలిసిన నూనెలను వాడడం పూర్తిగా మానేయాలి. రసాయనాలు కలిసిన నూనెలను వాడటం వలన మనకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.
రసాయనాలు కలిసి నూనెలను వాడటం మానేస్తే జుట్టును కాపాడుకోవడమే కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు.
ముఖ్యంగా అలోవేరా ను మన కురులకు పెట్టుకోవడం వలన మనం తలనొప్పి నుండి కూడా బయటపడొచ్చు. అలోవేరా ను మన తలకు పెట్టుకున్నప్పుడు ఎంతో చల్లదనాన్ని ఇస్తుంది.
అలోవేరా ను తినడం వలన కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు
అలోవెరా ను తినడం వలన మధుమేహం వ్యాధికంట్రోల్లో ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.
ఒకవేళ మీరు రసాయనలు కలిసినవి వాడాలి అనుకుంటే డాక్టర్స్ ను అడిగి వాడవచ్చు.
మీరు నాకు ఏమన్నా చెప్పాలి అనుకున్న లేక నన్ను ఏమన్నా అడగాలి అనుకున్నా కామెంట్ బాక్స్ లో అడగగలరు.
ధన్యవాదములు.
లేబుళ్లు: alovera and coconut oil for hair growth, alovera for hair growth, coconut oil for hair, Hair, hair growth, hair growth tips, reasons for hair fall


0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్