గ్రేట్ బ్యూటీ విత్ గ్రేప్ జ్యూస్
గ్రేట్ బ్యూటీ విత్ గ్రేప్ జ్యూస్
చాలామంది ఆడపిల్లల హ్యాండ్ బ్యాగ్ లో లిప్స్టిక్, మాయిశ్చరైజర్, ఫెయిర్నెస్ క్రీమ్ మొదలగు సౌందర్య ఉత్పత్తులు ఉంటాయి.
కానీ అవన్నీ మానవ శరీరానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో చర్మానికి హాని కలుగజేస్తాయి.
చర్మ నిపుణులు కూడా ఇదే చెప్తున్నారు.
అందుకుగాను ప్రకృతి అందిస్తున్న సహజ వనరులతోనే మన శరీరాన్ని కాపాడుకోవాలి.
ఈ విధంగా చేయడం వలన....
మనము అందాన్ని మరియు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.
ద్రాక్షతో ఆరోగ్యమే కాదు అందాన్ని కూడా పెంచుకోవచ్చు.
ద్రాక్షా లోని పోషకాలు:
పొటాషియం, క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.ద్రాక్షలో వివిధ రకమైన పోషకాలు ఉండడం వలన అవి మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా మన చర్మానికి సౌందర్యాన్ని చేకూరుస్తాయి.
ఇంతే కాకుండా ద్రాక్ష రసాన్ని తీసుకోవడం వలన జలుబు,ఫ్లూ, దగ్గు మొదలగు వాటి నుండి విముక్తి పొందవచ్చు.
100 గ్రాముల ద్రాక్ష నుంచి 69 క్యాలరీల శక్తి అందితే కొలెస్ట్రాల్ జీరో శాతానికి తగ్గుతుంది అంటున్నారు నిపుణులు.
పైగా ద్రాక్షలో విటమిన్ సి ఉండడం వలన అది మన శరీర సౌందర్య అభివృద్ధికి ఎంతగానోదోహద పడుతుందని చెబుతున్నారు నిపుణులు.
క్లెన్సింగ్ మాస్క్:
మీ ముఖానికి ద్రాక్ష మాస్క్ వేసుకోవడం వలన మీ ముఖము ఎంతో కాంతివంతంగా ఎంతో ప్రకాశవంతంగా మారుతుంది.
ఈ క్లెన్సింగ్ మాస్క్ అనేది పొడిబారిన చర్మానికి,నార్మల్ చర్మానికి,సున్నితమైన చర్మానికి ఇలా అన్ని రకాల చర్మాలకు అనుకూలంగానే ఉంటుంది.
ద్రాక్షారసం యాంటీ ఆక్సిడెంట్స్ లకు ప్రసిద్ధి చెందింది.
దీనివలన మీ చర్మం పై పేరుకున్న మలినాలను ఇది శుభ్రపరుస్తుంది.
ప్లేట్లెట్లు పెంచడానికి మరియు మీ చర్మాన్ని తాజాగా ఉంచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
సూర్యరశ్మి నుండి రక్షణ పొందడానికి:
ద్రాక్ష రసం లో ఫ్లవనోయిడ్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
మీ చర్మానికి నష్టం కలగకుండా ఉండడానికి మరియు అతినీలలోహిత కిరణాల నుండి రక్షణ పొందడానికి ద్రాక్ష రసం ఎంతగానో దోహదపడుతుంది.
మీ చర్మానికి ద్రాక్షరసం రాసినప్పుడు సూర్యకిరణాల నుండి తప్పించుకుని చల్ల గా ఉండడానికి ఎంతగానో సహాయపడుతుంది.
మీరు కనుక సున్నితమైన చర్మాన్ని కలిగి ఉంటే ద్రాక్ష రసం తో నయం చేసుకోవచ్చు.
సూర్యకిరణాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ద్రాక్ష రసం ఎంతగానో సహాయపడుతుంది.
కళ్ళకు చేసే మేలు:
కళ్ళ కింద ఉండే నల్లటి వలయాలను తొలగించడం లో ద్రాక్ష ఎంతగానో మేలు చేస్తుంది.
కళ్ళ కింద నల్లటి వలయాలు ఉన్నవారు గింజలు లేని ద్రాక్షను కోసి కనురెప్పల పైన ఉంచితే మీ కళ్ళ చుట్టూ ఉన్న నల్లటి వలయాలను తొలగించడమే కాక కళ్ళ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని మెరుగుపరుస్తుంది.
పొడి చర్మానికి ద్రాక్ష చేసే మేలు:
ఒక స్పూన్ ద్రాక్ష రసం మరియు గుడ్డు యొక్క తెల్లని సొన కలిపి మీ ముఖానికి రాసుకుని పది నిమిషాలు వదిలేయండి.
పది నిమిషాల తర్వాత మీ ముఖాన్ని కడగండి.
ఇలా చేయడం వలన మీ చర్మం ఎంతో సున్నితంగా, మృదువుగా తయారవుతుంది.
చర్మంను తేమగా ఉంచడంలో ద్రాక్ష యొక్క పాత్ర:
ద్రాక్ష చేసే మంచి అంతో ఇంతో కాదు, ద్రాక్ష రసం మన అందాన్ని పెంచడమే కాక మన చర్మానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది.
ద్రాక్ష రసం లో మన చర్మానికి ఎలా ఉపయోగించాలో కూడా మనం తెలుసుకోవాలి.ఒక స్పూన్ ద్రాక్ష రసంను మన చర్మానికి రాసి పదిహేను నిమిషాలు వదిలేయాలి.
పదిహేను నిమిషాల తర్వాత మన చర్మంను గోరువెచ్చని నీళ్ళతో కడుగు కోవడం వలన చర్మం తేమగా ఉంటుంది.
వయసును తగ్గించే ద్రాక్ష:
నిజానికి ద్రాక్ష వయస్సును తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.మీరు మీ చర్మం పైన ద్రాక్ష రసం వంటకాలను రాసుకోవడం వలన మీ చర్మం పైన ఎక్స్ ఫ్లాట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఈ ప్రక్రియ వలన చర్మంపైన ఉన్న డెడ్ స్కిన్ సేల్స్ ను తొలగిస్తుంది.అంతేకాకుండా రక్తప్రసరణను పెంచడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది.
మరియు ముడతలను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది.మీ చర్మం హైడ్రేట్ అయినప్పుడు ద్రాక్షరసం తాగటం వలన మీ చర్మం తేమగా ఉంటుంది.
మీరు నాకు ఎమన్నా చెప్పాలి అనుకున్న లేక నన్ను ఏమన్నా అడగాలి అనుకున కామెంట్ బాక్స్ లో అనగలరు.
ధన్యవాదములు.
లేబుళ్లు: Beauty tips


0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్