4, అక్టోబర్ 2021, సోమవారం

చర్మం నల్లబడుతుందా? అయితే ఇలా చెయ్యండి

చర్మం నల్లబడుతుందా?

అయితే   ఇలా  చెయ్యండి...

 కొంతమందికి శరీరం లో వివిధ భాగాలలో చర్మం నల్ల బడుతు వుంటుంది .

మరి ముఖ్యం గా ఎండ వేడి తగిలే ప్రాంతం లో ఇది మరీ స్పష్టం గా కనిపిస్తుంది. 

ఎండ లోకి వెళ్తే చాలు చర్మం పై మంట పుడుతుంది. ఎండ తాకిన ప్రాంతం నల్ల బడుతుంది. 

కొంత మందికి చర్మం పై నల్ల మచ్చలు ఏర్పడతాయి. ఈ విధమైన సమస్యలను పిగ్మింటేషన్ సమస్యలు గా చెప్తారు
హార్మోన్ల సమస్యల వల్ల, థైరాయిడ్ సంబంధిత సమస్య లు , ఈ మధ్య కాలంలో వాడుతున్న మెడిసిన్ వల్ల శిరోజాలకు క్రమం తప్పకుండా రంగు వేసుకునే వారికి ఈ విధమైన పిగమింటేషన్ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. 

సూర్యుడి అతి నీల లోహత కిరణాల వల్ల ఇంక ఎ ప్రత్క్కువ అయ్యే అవకాశం వుంది. ఈ సమస్యలు వచ్చిన తర్వాత తగు జాగ్రత్తలు తీసుకునే కంటే ముందే జాగ్రత్తలు తీసుకోవడం మేలు. 
ఆరంభ దశలోనే ఈ సమస్యలను గుర్తిస్తే పరిష్కారం కూడా సులువే అవుతుంది.

     కొన్ని చిట్కాలు...

  *మంచి నీళ్ళు ఎక్కువ గా తాగాలి.
  
*తాజా పండ్లు తినాలి 
 
 *తాజా పండ్ల రసాలు తాగాలి.
 
 *మజ్జిగ ఎక్కువగా తాగాలి.
 
 *నల్ల ద్రాక్ష, పుచ్చకాయ, దానిమ్మ పండ్లను తినాలి.
  
*బయటకి వెళ్ళడానికి ముప్పై నిమిషాల ముందు సన్స్క్రీన్ లోషన్ ను ముఖానికి రాసుకోవాలి.
  
*నల్ల ద్రాక్ష గుజ్జుకి కొంచెం తేనె కలిపి ప్రతి రోజు స్నానానికి ఇరవై నిమిషాల ముందు మొఖానికి రాసుకుని ఆ తర్వాత చల్లని నీళ్ళతో స్నానం చేయాలి.
  
*కొంచెం క్యారెట్, క్యాబేజ్ ఇంక కొంచెం ఓట్స్ కలిపి మిక్సీ లో వేసి పేస్ట్ చేసి దానిలో కొంచెం పాల మీగడ సగం చెంచా తేనె మూడు చెంచాల నిమ్మరసం కలిపి ముానికి రాసుకోవాలి.
 
 *ఇరవై నిమిషాల తర్వత కొంచెం గోరు వెచ్చని నీటితో మొఖాన్ని కడుక్కోవాలి.
 
 *ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖం పై నల్లటి మచ్చలు క్రమం గా తగ్గుతాయి.
 
 *పిగమంటేషన్ సమస్య ఉన్నవారు ఎండలో బయటకు వెళ్లి వాస్తే ముఖం కడుక్కుని కీరా ను గుండ్రంగా ముక్కలుగా కోసి ముఖం పై ఇరవై నిమిషాలు పాటు వుంచుకుని రిలాక్స్ అవ్వాలి.
  
*ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

 మీ కోసం ఒక చిట్కా :

చర్మం నల్లబడుతుంటే ఇలా చేయండి.
 రెండు నాటు టమాటాలను తీసుకోండి.వాటిని మిక్సీ పట్టండి బాగా మెత్తగా అయ్యేలా చూసుకోండి.అలా మెత్తగా అయిన మిశ్రమంలో రెండు లేదా మూడు స్పూన్ల తేనె ను కలపండి.

 అలా కలిపిన మిశ్రమం మీకు ఎక్కడైతే చర్మం నల్లగా ఉందో అక్కడ ఆ మిశ్రమాన్ని రాయండి. ఇలా రాసిన ఇరవై నిమిషాల తర్వాత మీరు మీ చర్మాన్ని శుభ్రపరుకోండి.

 ఈ చిట్కా వల్ల లాభాలు:


 టమాటా లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అది మన చర్మం ప్రకాశించడం లో సహాయ పడుతుందని నిపుణులు చెబుతున్నారు . అంతేకాకుండా దీనిలో క్లీనింగ్ ఎజెంట్స్ కూడా బాగానే ఉంటాయి. దాని వలన మన చర్మం పైన పేరుకుపోయిన మట్టిని తొలగించడంలో సహాయపడుతుంది. 

 ఇంకా తేనే విషయానికి వస్తే తేనెలో డెడ్ స్కిన్ సెల్స్ ని పోగొట్టే శక్తి ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా ఇది కూడా మన చర్మాన్ని క్లీన్ చేస్తుంది అనడంలో సందేహం లేదు.

 మీరు నన్ను ఏమైనా అడగాలి అనుకున్నా లేక నాకు ఏమైనా చెప్పాలి అనుకున్న కామెంట్స్ రూపంలో ఆడగలరు చెప్పగలరు.

ధన్యవాదములు.



 
  

లేబుళ్లు: ,

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]

<< హోమ్