డైటింగ్ లో జాగ్రత్తలు తప్పనిసరి
డైటింగ్ లో జాగ్రత్తలు
తప్పనిసరి
కొంత తమంది యువతులు ఒకరిని చూసి ఒకరు సన్నగా నాజూగ్గా మారాలి అనుకుని విశ్వ ప్రయత్నాలు చేస్తారు. అలా చేసే ప్రయత్నంలో అన్నం తినడం మానేస్తారు.ఎప్పుడూ కూడా అద్దం ముందు కూర్చుని చూసుకుంటారు నేను సన్నగా అయ్యానా లేదా అని. అలా అన్నం తినకుండా ఉండడం వలన మీరు ఎంతో బలహీనంగా తయారవుతారు.
చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఎంతసేపు స్లిమ్ముగా, నాజూగ్గా అవ్వాలని ఆలోచన చేస్తూనే ఉంటారు. ఇలా చేయడం వలన మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. అంతేకాకుండా మిమ్మల్ని చూసి మీ ఇంట్లో వాళ్ళు కంగారు పడవచ్చు.
డాక్టర్లు కూడా ఇదే చెబుతున్నారు. డైటింగ్ అనే పేరుతో మిమ్మల్ని మీరే ఆనారోగ్యం పాలు చేసుకుంటున్నారు. ఇవే కాకుండా మీ అందాన్ని కూడా మీరు కోల్పోతున్నారు.
డైటింగ్ అనేది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రోటీన్లు:
ప్రొటీన్లు అనేవి శరీరానికి చాలా అవసరం. శరీరంలో కావలసినంత ప్రోటీన్లు లేకపోవడం వలన మన శరీరం అలసిపోతుంది. అలసి పోకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి.
మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఆకుపచ్చని కూరలు అధిక శాతంలో ఉండేలా చూసుకోవాలి. వీటిలో విటమిన్స్ అధిక మోతాదులో ఉంటాయి. కాబట్టి మీరు డైట్ చేసేటప్పుడు ఇవి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
మీరు తినే కూరలు ఉప్పు, కారాలు ఉన్నా పరవాలేదు గాని నూనె లేకుండా చూసుకోండి.అలాగే బంగాళదుంపను మీరు డైట్ వున్నా రోజులలో తినకుండా ఉండడమే మంచిది.
ఇదే విధంగా అరటిపండును కూడా మీరు డైట్ వున్న సమయాలలో తినకుండా ఉండడమే మంచిది అంటున్నారు డాక్టర్లు. అరటి పండు మనం బరువు పెరగడానికి కారణమవుతోంది. అందుకనే మనం డైట్ లో ఉన్నప్పుడు అరటి పండులో తినకుండా ఉండడమే మంచిది.
అల్పాహారం:
మీరు డైట్ వున్నా సమయాలలో అల్పహారాన్ని మానకూడదు. వీలైనంత తక్కువగా మోతాదులో కార్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకోవాలి. తేలికగా జీర్ణమయి,ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
పండ్లు లాంటివి తీసుకోవడం వలన ప్రోటీన్లు అందడమే కాకుండా తొందరగా జీర్ణమవుతాయి. రోజుకి ఆరు నుండి ఏడు గ్లాసుల నీళ్ళు తీసుకోవడం వలన మన శరీరం డిహైడ్రేట్ కి గురికాకుండా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా శక్తిని కూడా కోల్పోకుండా ఉంటాము.
డైట్ లో ఉన్నప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ ని తినకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే వీటిని చాలా మంది ఇష్టపడతారు వాటిని తినకుండా కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమే ఎందుకంటే అవి అంత రుచిగా ఉంటాయి.
కానీ తప్పదు డైటింగ్ లో ఉన్నప్పుడు పక్కన పెట్టేయాలి. వీటిలో బంగాళదుంప ఉంటుంది. బంగాళదుంప లో అధిక మొత్తంలోకార్బోహైడ్రేట్లు ఉంటాయి. అవి మనం బరువు పెరగడానికి కారణం అవుతాయి.
కండరాలు:
డైటింగ్ చేస్తున్నాం కదా అని మనం ప్రతిరోజూ చేసే వ్యాయామాన్ని పక్కన పెట్టకూడదు. వ్యాయామం చేస్తూనే ఉండాలి. ఇది మాత్రమే కాకుండా వర్కవుట్లు, వాకింగ్, మెట్లు ఎక్కి దిగడం ఇలాంటి పనులు చేయడం వలన మన శరీరంలోని క్యాలరీలు కరుగుతాయి.
కేలరీలు కరగడమే కాకుండా పైన చెప్పినవి చేయడం వలన మన కండరాలు బలంగా తయారవుతాయి. కండరాల తో పాటు మన జీర్ణ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేస్తుంది.
మనం తీసుకునే ఆహారంలో కూరలు తప్పనిసరిగా ఉండాలి వీలైనంతవరకు కూరగాయలను పచ్చిగా గాని లేదా ఉడకబెట్టుకొని గాని తినడానికి ఇష్టపడండి. మీ వల్ల కాకపోతే ఉప్పు కారం వేసుకుని తినండి.
అంతేగాని నూనె మాత్రం వాడకండి.కూరగాయలలో బ్రకోలి తినడం వలన దానిలోవిటమిన్ సి, కె,పొటాషియం పోలిక్ యాసిడ్ ఉంటాయి. ఈ విటమిన్స్ ఉండటం వలన మనకు ప్రోటీన్స్ అందుతాయి.
డైటింగ్ చేసేటప్పుడు షుగర్ లెవెల్స్ ఎలా ఉండాలి:
ఉన్నపళంగా మనం తీసుకునే స్వీట్స్,ఐస్ క్రీమ్స్, శీతల పానీయాలు, పండ్ల రసాలు మన శరీరంలోని లారీలను పెంచుతాయి.కాస్త కష్టమైనా గాని మనం డైటింగ్ చేసే సమయంలో వీటికి దూరంగా ఉండటమే మంచిది. ఇవి మనం బరువు పెరగడానికి కారణం అవుతాయి.
వీటిని పక్కన పెట్టి వీటికి బదులుగా పండ్ల ముక్కలను తీసుకోవచ్చు వీటిలో అరటికాయ మినహాయించి అన్ని పండ్లను తినవచ్చు. మరిముఖ్యంగా పుచ్చకాయ మరియు కివి అలాంటి పండ్లను తీసుకోవడం వలన మనము తొందరగా అలసిపోము. బదులుగా ప్రోటీన్లు కూడా మనకు అందుతాయి.
మధుమేహం ఉన్న వారు,షుగర్ లేని వాళ్ళు ఎవరైనా గాని డైటింగ్ చేసేటప్పుడు వీటిని అసలు తినకూడదు అవి ఏమనగా వైట్ బ్రెడ్ ను అసలు తినకూడదు పూర్తిగా పక్కన పెట్టడమే మంచిది.
ఎందుకనగా వైట్ బ్రెడ్ లో ఎక్కువ శాతం లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా వైట్ బ్రెడ్ లో చక్కెర శాతం కూడా ఎక్కువగా ఉంటుంది.
చక్కెర శాతం ఎక్కువగా ఉండడం వలన చక్కెర స్థాయి అమాంతంగా పెరిగి పోతుంది. స్థాయి పెరగడం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది మాత్రమే కాకుండా బరువు పెరగడానికి కారణమవుతుంది.
మనం డైటింగ్ లో ఉన్నప్పుడు తక్కువ శాతంలో రైస్ తీసుకోవడం మంచిది.ఒకవేళ తప్పదు మేము రైస్ తీసుకోవాలి అనుకునేవారు, వైట్ రైస్ కి బదులు బ్రౌన్ రైస్ ని తీసుకోవడం మంచిది.
ఎందుకనగా వైట్ రైస్ లో కార్బోహైడ్రేట్లు మరియు ఫైబర్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఇవి తీసుకోవడం వలన బరువు పెరగడానికి కారణం అవుతాయి.వీటి వల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి.
అందుకని షుగర్ ఉన్న వాళ్ళు డైటింగ్ లో ఉండే టప్పుడు వైట్ డ్రెస్ కి బదులు బ్రౌన్ రైస్ చేసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు. షుగర్ లేని వాళ్ళు కూడా వైట్ రైస్ తీసుకోకుండా ఉండడమే మంచిది.
ఆయాసం ఉన్నవారు డైటింగ్ చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల:
ఆయాసం ఉన్నవారు డైటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. వాటిలో కొన్ని మనం ఎప్పుడు మాట్లాడుకుందాం. ఆయాసం ఉన్నవారు రోజులో రెండుసార్లు మాత్రమే తినడం మంచిది.
ఎందుకనగా రోజులు రెండు సార్లు తినడం వలన హెవీ గా ఉండవచ్చు. దానివలన మనం ఆయాసానికి గురవుతారు. రోజులో రెండు సార్లు తినడం వలన మనకు ఆయాసం రాదు, ఇది మాత్రమే కాకుండా మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము.
ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి సమయంలో తినాలి అనే వాటి గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం
ఉదయాన్నే తీసుకొనే ఆహారంలో మనం వెజిటేబుల్ జ్యూస్ తాగడం వలన మనకు తేలికగా ఉంటుంది. దాని వలన మనకు ఆయాసం అనేది రాదు. తీసుకున్న గంటకు లేదా ముప్పావు గంట కు మనకు ఆకలి వేస్తుంది.
ఆ సమయంలో మనము తీసుకునే ఆహారంలో రైస్ లేకుండా చూసుకోవడం మంచిది. రెండు పుల్కాలు, రెండు కూరలు, ఒక కప్పు పెరుగు తీసుకోవడం మంచిది. ఎక్కువగా కూరలను తినడం మంచిది.
సాయంత్రం సమయంలో మనం 6 నుండి 7 గంటల లోపు మనం మన ఆహారాన్ని ముగించేయాలి.. తొందరగా మనం ఆహారాన్ని ముగించడం వల్ల మనకు ఆయాసం అనేది రాదు.
సాయంత్రం సమయంలో తినే ఆహారంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటంటే, మొత్తం కూడా పండ్లు మాత్రమే తినాలి. ఆ పండ్లలో అరటి పండును మినహాయించి ఇంకా అన్నీ తినవచ్చు.
అరటిపండు తినడం వలన మనం బరువు పెరిగే అవకాశం ఉంది. అందుకనే అరటిపండును తినకుండా ఉండడమే మంచిది. అది కాకుండా మనం పండ్లు తినడం వలన మనకు ఆయాసం రాదు.
మన జీర్ణ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేస్తుంది. రాత్రి సమయంలో తీసుకునే ఆహారంలో పండ్లు తీసుకోవడం వలన మనకు ఉదయాన్నే పదింటి వరకు కూడా ఆకలి వేయదు, ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది.
తగు జాగ్రత్తలు తీసుకోవడం వలన మీరు తక్కువ సమయంలో మీ బరువును తగ్గించుకో గలుగుతారు, మరియు ఆరోగ్యంగా కూడా ఉంటారు.
ఇవి మాత్రమే కాకుండా ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళలో నిమ్మకాయ రసం మరియు తేనె కలుపుకోవడం వలన కూడా మీరుతొందరగా బరువు తగ్గుతారు. ఇది నా స్వయం అనుభూతి.
మీరు నాకు ఏమన్నా చెప్పాలి అనుకున్న లేక నన్ను ఏమైనా అడగాలని అనుకున్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.
ధన్యవాదములు.
లేబుళ్లు: diet and health care, Dieting, dieting foods for wait loss, dieting plan, easy ways to wait loss, wait loss


3 కామెంట్‌లు:
Excellent information
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Tq sir...
Tqs for your feedback
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్