దృఢమైన జుట్టు కోసం ఈ ఒక్కటి
దృఢమైన జుట్టు కోసం
ఈ ఒక్కటి
"2020 వ సంవత్సరంలో ఎఫ్ పి టి సంస్థ( ఫస్ట్ ప్రొడక్షన్ టెస్టింగ్) వియత్నం వారు పరిశోధనలు చేసి ఈ విషయాలన్నిటినీ కూడా బయట పెట్టారు"
"ఆరోగ్యపరంగా గాని,అందం పరంగా గాని మనకున్న సమస్యలకు ప్రకృతి నుండి సమాధానాలు లభిస్తాయి"
ప్రతి ఒక్కరు కూడా నేను అందరిలో కన్నా కూడా అందంగా కనపడాలి,అందరి కళ్ళు నా పైనే ఉండాలి అందరిని నేనే ఆకర్షించాలి ఇలా చాలా మంది అనుకుంటారు. అది యువకులు గాని యువతులు గాని.
దాని కోసం వారు చాలా ప్రయత్నాలు చేస్తారు. అలా ప్రయత్నాలు చేసే క్రమంలో వారు చాలా రసాయనాలు కలిసిన ప్రొడక్ట్స్ ను వాడతారు.
మరీ ముఖ్యంగా జుట్టు కోసం అయితే ఇంక చెప్పక్కర్లేదు. జుట్టు పెరగాలి అని చాలా షాంపూలు మరియు నూనెలు వాడతారు.
కానీ వాటిలో కొన్ని మన జుట్టుకు సరిపడా తాయి. ఇంకా కొన్ని అయితే జుట్టు ఊడిపోవడానికి కారణాలు అవుతాయి. ఇది మాత్రమే కాకుండా మనకు చుండ్రు రావడానికి మరియు తల దురద పుట్టడానికి కూడా కారణం అవుతాయి.
ఏది పడితే అవి వాడి మన అందాన్ని మనమే మన చేతులారా పోగొట్టుకుంటున్నాం. ఇంకా కొంతమంది అయితే డాక్టర్లను మరియు ఇంకా కొంతమంది అయితే జుట్టు పెరగడానికి కొన్ని రకాల ట్రీట్మెంట్ తీసుకుంటారు.
ఇలా డాక్టర్ల దగ్గరికి వెళ్లిన మరియు జుట్టు పెరగడానికి కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్న కూడా ప్రయోజనాలు కొంతమందికి కనబడవు.
ఇప్పుడు జరుగుతున్న వాతావరణంలో మార్పుల వలన గాని లేకపోతే మన శరీరంలో మన జుట్టుకు కావలసిన పోషకాలు అందకపోవడం వలన కూడా జుట్టు రాలడం మరియు జుట్టు చిట్లడం మరియు జుట్టు కుదుళ్ల దురద రావడం లాంటివవి జరుగుతాయి.
మన పూర్వికుల సమయంలో అయితే, ఎటువంటి వాతావరణ సమస్యలు ఉండేవి కాదు, ఎటువంటి కాలుష్య సమస్యలు కూడా ఉండేవి కాదు.
ఇవి మాత్రమే కాకుండా వారు తీసుకునే ఆహారంలో పోషక విలువలు కూడా అధిక మొత్తంలో ఉండేవి. దానివలన జుట్టుకు కావలసిన పోషక విలువలు కూడా చక్కగా వాళ్ల జుట్టుకు అందేవి.
మన పూర్వీకులు సమయంలో అయితే, మన పూర్వీకులు ఎప్పుడూ కూడా తలకి కొబ్బరి నూనెను పెట్టుకునే ఉండేవారు. ఒక విధంగా చెప్పాలంటే పెళ్లిళ్లు లేదా ఏమైనా పండగ రోజుల్లో మాత్రమే తల స్నానం చేసి.
ఇవి కూడా ఎలా ఉండేవి అంటే పొద్దున్నే తలస్నానం చేస్తే మధ్యాహ్నం నూనె పెట్టేసేవారు. కేవలం ఆ కొంచెం సమయం లో మాత్రమే జుట్టుకు నూనె లేకుండా ఉండేది.
ఇలా నూనె పెట్టడానికి గల కారణాలు ఏమిటి అంటే, ఆడవారి జుట్టు పైకి లేచి రేగు ఉండకూడదు అని ఒక ఆచారంలా భావించేవారు.
ఇది మాత్రమే కాకుండా జుట్టు పెరగడానికి మరియు జుట్టు బలంగా ఉండటానికి మరియు జుట్టు ఊడకుండా ఉండడానికి కూడా ఇలా తలకు ఎప్పుడూ కూడా నూనె పెట్టి ఉండేవారు.
మరి ఇప్పుడున్న కాలంలో అయితే జుట్టుకు నూనె రాసుకుంటే జుట్టు ఆగిపోయే వారికి ఉన్న అందం తగ్గుతుంది అని భావించి తలకు నూనె పెట్టడం పూర్తిగా మానేశారు.
ఇలా తలకు నూనె పెట్టక పోవడం వలన జుట్టు చివర్లు చిట్లడం జుట్టు ఊడిపోవడం మరియు జుట్టు యొక్క రంగు మారిపోవడం మొదలగు సమస్యలు రావడం మీరు గమనించవచ్చు.
ఇలాంటి సమస్యల నుండి దూరంగా ఉండడం కోసం డాక్టర్ల మనకు కొన్ని సూచనలు పాటించమని చెబుతున్నారు. అవి ఏంటో మనం ఎప్పుడు కలుసుకుందాం.
మొదటి చిట్కా:
లావెండర్ ఆయిల్:
మీరు లావెండర్ ఆయిల్ గురించి వినే ఉంటారు. లావెండర్ ఆయిల్ గురించి శాస్త్రజ్ఞులు కేవలం జుట్టుకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని మాత్రమే ప్రయోగాలు చేశారు.
దీని ద్వారా వారు చాలా విషయాలు తెలుసుకున్నారు. జుట్టు పెరగడానికి లావెండర్ ఆయిల్ లో ఉన్న పోషకాలు ఏంటి అవి జుట్టు పెరగడానికి ఏ విధంగా ఉపయోగపడతాయి అనే విషయాల గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు పెరగడానికి లావెండర్ ఆయిల్ లో ఉండే పోషకాలు ముఖ్య కారణమని చెబుతున్నారు. అవి ఏమిటంటే:
1.లీనాలోల్
2.లినాలిల్ అసెటేట్
ఈ రెండు కెమికల్స్ కూడా జుట్టు పెరగడానికి మరియు హెయిర్ ఫాలీక్ దగ్గర ఇంప్లమ్మషన్ వచ్చి జుట్టు రాలడం ను నివారిస్తుంది అని శాస్త్రజ్ఞులు చేసిన పరీక్షలలో బయటపడింది.
లావెండర్ ఆయిల్ ను ఎలా ఉపయోగించాలి అనే విషయానికి వస్తే, మనం వాడుకునే నూనె కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ ఇలా ఏవైనా మనం వాడుకునే నూనె ఆరు స్ఫూన్లు తీసుకుని దానిలో 15 చుక్కల లావెండర్ ఆయిల్ ను కలపాలి.
ఇలా కలిపిన తర్వాత ఆ నూనెను మన తలకు రాసుకోవాలి. ఇలా ఆరు స్పూన్ల నూనె మరియు 15 చుక్కల లావెండర్ ఆయిల్ వేయడం వలన మన జుట్టు యొక్క పెరుగుదలను మనం గమనించవచ్చు అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
ఇలా ఆరు స్పూన్ల నూనె మరియు 15 చుక్కల లావెండర్ ఆయిల్ నిష్పత్తిని శాస్త్రజ్ఞులే చెప్పారు. ఈ నిష్పత్తి కన్నా ఎక్కువ మొత్తంలో లావెండర్ ఆయిల్ ను వేయడం వలన మన తల మంట కు గురి అవుతుంది అని కూడా చెప్పారు.
"2020 వ సంవత్సరంలో ఎఫ్ పి టి సంస్థ( ఫస్ట్ ప్రొడక్షన్ టెస్టింగ్) వియత్నం వారు పరిశోధనలు చేసి ఈ విషయాలన్నిటినీ కూడా బయట పెట్టారు"
నేను చెప్పే విషయాలు అన్నీ కూడా శాస్త్రజ్ఞులు పరిశోధించి చెబుతున్నవి. వాటినే నేను మీకు తెలియజేస్తున్నాను.
ఆరోగ్యపరంగా గాని,అందం పరంగా గాని మనకున్న సమస్యలకు ప్రకృతి నుండి సమాధానాలు లభిస్తాయి.
ప్రకృతిని మనం ఎంత మంచిగా కాపాడుకుంటే మనకున్న ఆరోగ్య సమస్యల నుండి మరియు అందం గురించిన సమస్యల నుండి ప్రకృతే మనలను కాపాడుతుంది. ఇది వాస్తవం.
మీరు నాకు ఏమన్నా చెప్పాలి అనుకున్న లేక నన్ను ఏమన్నా అడగాలి అనుకున్నా కామెంట్స్ రూపంలో తెలుపగలరు.
ధన్యవాదములు.
లేబుళ్లు: essential oil hair growth, essential oils, growing hair, growth of hair, hair grow, hair growth, hair growth oil, hair growth oils, hair oil growth, lavender essential oil, lavender oil, oils for hair growth


0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్