19, నవంబర్ 2021, శుక్రవారం

సౌందర్య ని పెంచుకోవడం కోసం ఈ ఒక్క పువ్వు చాలు

సౌందర్య ని పెంచుకోవడం

కోసం ఈ ఒక్క పువ్వు

చాలు

 చాలామంది యువతులు తమ చర్మం మరియు తమ ముఖం మృదువుగా,సున్నితంగా మరియు ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటారు. అలా తమ చర్మం ఉండాలని కోరుకునే వారి కోసం ఈ చిట్కా.

 మొదటి చిట్కా:

 1.గులాబీ రేకులు

 2.అలోవెరా జెల్

 తయారు చేసుకునే విధానం:

    ముందుగా ఎండిన గులాబీ రేకులను తీసుకుని వాటిని మెత్తని పేస్టులా చేయాలి. ఇలా పేస్ట్ లా చేసిన మిశ్రమాన్ని 2 స్పూన్లు తీసుకుని దానిలో మూడు స్పూన్ల అలోవెరా జెల్ ను కలపాలి.

    ఇలా కలిపిన మిశ్రమాన్ని మీరు ఎక్కడైతే మీ చర్మం ప్రకాశవంతంగా zమృదువుగా మరియు సున్నితంగా ఉండాలి అని భావిస్తున్నారో అక్కడ రాసుకోండి.

    ఈ మిశ్రమాన్ని మీరు మీ మొహానికి కూడా రాసుకోవచ్చు. ఇలా రాసిన ఇరవై నిమిషాల తర్వాత మీరు కడుగు కొనవచ్చు.



    ప్రయోజనాలు:

   గులాబీలు సౌందర్యానికి పెట్టింది పేరు గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గులాబీలను సౌందర్యంలో అంతలో ఉపయోగిస్తాం.

   అసలు ఎందుకు ఇంత ఉపయోగిస్తామని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

   గులాబీలలో గ్లాకోసైడ్స్,కార్బాక్సిలిక్ యాసిడ్,ఎంతోసైనిన్,ఫ్లావొనోయిడ్స్ ఈ విటమిన్స్ అన్ని కూడా గులాబీ లో ఉంటాయి.

   ఈ విటమిన్స్ గులాబీ లో ఉండడం వలన గులాబీ యాంటీఏజింగ్ ఫంక్షనింగ్ గా పని చేస్తోంది.స్నానం చేసిన తర్వాత రోజ్ వాటర్ ని చర్మానికి అప్లై చేయడం వలన రోజ్ వాటర్ లో ఉండే విటమిన్స్ మన శరీర పీహెచ్ విలువను బాలన్స్ చేస్తాయి.

   గులాబీలు ఆయిలీ స్కిన్ ను మామూలు చర్మం లాగా మార్చడానికి కూడా ఎంతగానో సహాయపడతాయి. అందువల్ల సౌందర్యానికి పెట్టింది పేరుగా గులాబీని చెప్పుకుంటారు.

   ఇంకా అలోవెరా విషయానికొస్తే మన అందరి ఇంట్లో కూడా అలోవెరా ఉంటుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు.అందరి ఇళ్లలో కూడా అలోవెరా ఉంటుంది అంటే దాని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి మీరు గమనించవచ్చు.

   అలోవెరా లోని విటమిన్స్ మన మొహం పైన ఉన్న మొటిమలను తగ్గించడానికి మరియు మన చర్మం ప్రకాశించడానికి మరియు ముడతలు రాకుండా ఉండడం లో ఎంతగానో సహాయపడుతుంది.

   రెండవ చిట్కా:

   1. గులాబీ రేకులు

   2. రోజ్ వాటర్

   3. అలోవెరా జెల్

   4. పెరుగు

   5. ముల్తానామట్టి

  తయారు చేసుకునే విధానం:

   ముందుగా మనం గులాబీ రేకులను తీసుకోవాలి. అలా తీసుకున్న గులాబీ రేకులకు సరిపడినన్ని రోజ్ వాటర్ ని కలిపి మెత్తని పేస్టులా చేయాలి.

   ఇలా చేసిన పేస్టులో ఒక స్పూన్ లేదా రెండు స్పూన్ల ఆలోవెరా జెల్ ను కలపాలి. ఇలా కలిపిన మిశ్రమంలో రెండు స్పూన్ల పెరుగును కలపాలి.

   ఈ మిశ్రమంలో ఇప్పుడు ముల్తానామట్టి ని కలపాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని మన మొహానికి రాసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాసుకుని 20 నిమిషాల నుండి 30 నిమిషాల వరకు ఉండాలి.

   ఈ చిట్కా ని వారంలో రెండు మూడు సార్లు పాటించడం వలన మెరిసే ముఖం మరి ముడతలు లేని చర్మం మీ సొంతం అవుతుంది.



   ప్రయోజనాలు:

   గులాబీ లో ఉండే విటమిన్స్ గురించి మనం పైన చర్చించుకున్నాము. గులాబీ లో ఉండే విటమిన్స్ మన శరీరానికి ఏవి ఏ విధంగా ఉపయోగపడతాయో మనం తెలుసుకున్నాము.

   అదేవిధంగాఅలోవెరా గురించి కూడా మనం తెలుసుకున్నాము.అలోవెరా లో ఉండే విటమిన్స్ మన మొహం పైన వచ్చే ముడతలను మరియు మొటిమలను తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయని మనం తెలుసుకున్నాము..

   ఇంకా రోజ్ వాటర్ విషయానికి వస్తే రోజ్ వాటర్ గురించి శాస్త్రవేత్తలే ప్రయోగాలు చేసే చెప్తున్నారు. రోజ్ వాటర్ మన చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని.

   రోజ్ వాటర్ ని మనం మన శరీరానికి రోజూ అప్లై చేయడం వలన రోజ్ వాటర్ మన చర్మానికి సరిపడా పీహెచ్ విలువ ఇస్తుంది అని శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి మరీ చెప్పారు..

   ఇంకా పెరుగు విషయానికొస్తే పెరుగు మొహానికి రాసుకున్నప్పుడు పెరుగులో ఉండే చల్లదనం మన చర్మానికి తాకినప్పుడు మన చర్మం కింద ఉండే రక్త కణాలు ఉత్తేజ పరుస్తాయి.

   అలా ఉత్తేజ పడినప్పుడు చర్మం కింద రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా పెరుగు మన చర్మం పైన ఉండే డెడ్ స్కిన్ సెల్స్ ను పోగొడుతుంది.

   ఇంకా ముల్తానామట్టి విషయానికి వస్తే దీని గురించి పురాతన కాలం నుండి మనం వింటూనే ఉన్నాం. ముల్తానామట్టి మన చర్మం రంగు రావడానికి ఎంతగానో సహాయపడుతుంది.

   మూడవ చిట్కా:

   1.గులాబీ రేకుల పొడి

   2.తేనే

   తయారు చేసుకునే విధానం:

   ముందుగా చిన్న గిన్నె తీసుకొని దానిలో ఎండబెట్టిన గులాబీ రేకులను పొడి చేసి వేసుకోవాలి. అప్పుడు లో ఒకటి నుండి రెండు స్పూన్ల తేనెను కలపాలి.

   ఇలా కలిపిన ఈ మిశ్రమంను మీ మొహానికి రాసుకోవాలి.ఇలా రాసుకుని 20 నిమిషాలు ఆయన తర్వాత మళ్లీ మొహాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.

   ఇలా వారంలో రెండు మూడు సార్లు చేయడం వలన మృదువైన చర్మం మరియు మిలమిలలాడే ముఖం మీ సొంతమవుతుంది.

   ప్రయోజనాలు:

   గులాబీ గురించి మనం పైన చాలానే తెలుసుకున్నాం. ఇంకా తేనే విషయానికొస్తే, యాంటీ ఏజింగ్ ఫంక్షనింగ్ గా పనిచేస్తుంది. మరియు తేనె డెడ్ స్కిన్ సెల్స్ ను పోగొట్టడంలో ఎంతగానో సహాయపడుతుంది.

   నేను చెప్పినవన్నీ కూడా డాక్టర్లు మరియు శాస్త్రవేత్తలు చెప్పినవే.

   మీరు నాకు ఏమన్నా చెప్పాలి అనుకున్న లేక నువ్వు ఏమన్నా అడగాలి అనుకున్నా కామెంట్స్ రూపంలో తెలుపగలరు.

   ధన్యవాదములు.

   

   

   

   

   

   

లేబుళ్లు: , , , , , , , , , , , ,

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]

<< హోమ్