11, నవంబర్ 2021, గురువారం

పెదాల పగుళ్లు నుండి మీ పెదాలను కాపాడుకోవాలా? అయితే ఇది మీ కోసమే

 పెదాల పగుళ్లు నుండి మీ

పెదాలను

కాపాడుకోవాలా? అయితే

ఇది మీ కోసమే

లా మంది యువతులు మరియు యువకులువారు అందంగా కనపడాలి అనుకుంటారు. అలా అందంగా కనపడాలి అని చాలా విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు.

 మనం అందంగా కనపడాలి అనుకుని మన మొహన్ని ఎంతో అందంగా తయారు చేసుకుంటాం.  ఇలా అందంగా కనపడాలి అనే విషయంలో మన పెదాలు ఎంతో ముఖ్య పాత్ర వహిస్తాయి.

 అందువల్ల మనం మన పెదవులకు లిప్స్టిక్ లాంటి కొన్ని రసాయనాలు కలిగిన వాటిని ఉపయోగిస్తుంటాం. ఇంకొంతమంది అయితే వారి పెదాలు లిప్స్టిక్ రాసిన గాని అందంగా కనపడవు.

 వారి పెదాలు పగుళ్ళు మరియు మరి పెదాల నుండి ఊడిపోవడం గమనించవచ్చు. ఇలాంటి వారు ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

 చాలామందికి వాతావరణంలో మార్పులు ఏర్పడగానే వారి శరీర భాగాలలో కూడా కొన్ని మార్పులు జరుగుతాయి.

 ఆ మార్పులు ఎలా ఉంటాయి అంటే కాళ్ళ పగుళ్ళు మరియు పెదాల పగుళ్లు ఇలా కొన్ని రకాల సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉండడాన్ని మనం గమనించవచ్చు.

 నిజంగా మనకు చలికాలం వచ్చినప్పుడు మన పెద్దలు పగలడం మరియు మన నోటి లో పుండ్లు రావడాన్ని గమనించవచ్చు.

 ఇది మాత్రమే కాకుండా మనం ఒకటి లేదా రెండు రోజులు చలి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా మన పెదాలు పగలడం గమనించవచ్చు.




 ఒక్కొక్కసారి అయితే ఎండాకాలంలో కూడా మన పెదాలు పగలడం గమనించవచ్చు. ఎండాకాలంలో కూడా ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఎండాకాలంలో వచ్చే వడగాలుల వలన పెదాలు పగలడం ఏర్పడుతుంది.

 ఇలా పెదాల పగుళ్ళు ఏర్పడి నప్పుడు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వాటి గురించి డాక్టర్లు ఏం చెప్తున్నారు అని మనం ఎప్పుడు కలుసుకుందాం.

 పెదాల పగుళ్లు ఏర్పడినప్పుడు మీరు ఎలాంటి డాక్టర్లను సంప్రదించ అక్కరలేదు అని డాక్టర్లే చెబుతున్నారు.

 ఎందుకంటే పెదాల పగుళ్ళను పోగొట్టడానికి మన వంటగదిలోనే దివ్యౌషధం ఉంది అని అంటున్నారు డాక్టర్లు.

 

 మొదటి చిట్కా:

 

 అది ఏంటి అంటే నెయ్యి. నెయ్యి మన పెదాలు పగలడం లో ఎలా సహాయపడుతుంది అంటే, మరీ ముఖ్యంగా పెరుగున్ననెయ్యి అంటే చలికాలంలో నెయ్యి పేరుకుంటుంది.

 దీనిని మన పెదవులకు రాసినప్పుడు ఆ నెయ్యి మన పగిలిన పెదవులు అతుక్కోవడానికి ఎంతగానో సహాయపడుతుంది అంటున్నారు డాక్టర్లు.

 ఈ నెయ్యి ని రోజుకి రెండు నుండి మూడు సార్లు మీకు ఖాళీ ఉన్న సమయంలో మీ పెదవులకు రాసుకోవడం వలన మీ పెదాలు ఎంతో సున్నితంగా మరియు అందంగా నిగనిగలాడటానికి మీరు గమనించవచ్చు.

 పేరుకున్న నెయ్యిని మాత్రమే కాకుండా వేసవికాలంలో మామూలు నెయ్యి కూడా మీరు పెదాలకు రాసుకోవచ్చు.

 ఇలా నెయ్యి మీ పెదవులకు రాసుకోవడం వలన రెండు రోజుల్లోనే మీరు మంచి ఫలితాలను పొందుతారు అంటున్నారు నిపుణులు.

 

 రెండవ చిట్కా:


 కావలసిన పదార్థాలు:

 1.  పంచదార హాఫ్ టేబుల్ స్పూన్

 2. తేనే ( సరిపడినంత)

 తయారు చేసుకునే విధానం:

 ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో హాఫ్ టేబుల్ స్పూన్ పంచదార మరియు సరిపడినంత తేనె వేసి గట్టిగా అయ్యేంతవరకు కలపాలి.

 అలా గట్టిగా అయినా మిశ్రమంను కొంచెం వేలితో తీసుకొని దానిని మీ పెదాలకు మెల్లగా రుద్దాలి. ఇలా రుద్దడం వలన ఏం జరుగుతుంది అంటే,

 పంచదార మీ పెదాలపై ఉన్న పలికిన చర్మాన్ని తొలగిస్తుంది. తేనె  మీ పెదాలపై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తుంది.

 ఇది మాత్రమే కాకుండా పంచదార ఒక మంచి స్క్రబ్ లా పనిచేస్తుంది. కేరళ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ పెదాలు అందంగా కనబడటం లో సహాయం చేస్తాయి.


 మూడవ చిట్కా:


 కావలసిన పదార్థాలు:

 1. పంచదార వన్ టేబుల్ స్పూన్

 2. పారాషూట్ ఆయిల్ టేబుల్ స్పూన్

 3. నిమ్మకాయ సగం

 తయారు చేసుకునే విధానం:

 ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ పారాషూట్ ఆయిల్ మరియు ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసి కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత సగం నిమ్మకాయను రసమును ఆ మిశ్రమంలో కలపాలి.

 ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక చిన్న కంటైనర్ లోకి తీసుకోవాలి. ఇలా చిన్న కంటైనర్ లోకి తీసుకున్న మిశ్రమంను మన చూపుడువేలుతో తీసుకోవాలి.

 ఇలా తీసుకున్న మిశ్రమంను మన పెదవులకు మెల్లగా రుద్దుతూ ఉండాలి. ఇలా రుద్దడం వలన పంచదార ఒక మంచి స్క్రబ్లా పనిచేస్తుంది. ఇది మాత్రమే కాకుండా పెదాల పైన పేరుకుపోయి ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ను పోగొడుతుంది.

 ఇంకా కొబ్బరి నూనె విషయానికొస్తే కొబ్బరి నూనె మన పెదవుల పైన ఉన్న చర్మం లోపల వరకు వెళుతుంది. అలా లోపల వరకు వెళ్లడం వలన మన పెదవులు ఎండిపోకుండా ఎప్పుడూ నిగనిగలాడుతూ ఉంటాయి.

 ఇంకా నిమ్మకాయ విషయానికొస్తే నిమ్మకాయలో ఉండే సి విటమిన్ వలన మన పెదవులు లేత గులాబీ రంగు లోకి వస్తాయి. ఇది మాత్రమే కాకుండా నిమ్మకాయలో ఉండే విటమిన్ సి వలన మన పెదాల పగుళ్ళు తగ్గుముఖం పడతాయి.


 నేను చెబుతున్నవన్నీ కూడా డాక్టర్లు చెబుతున్న వే.

 మీరు నాకు ఏమన్నా చెప్పాలి అనుకున్న లేక నన్ను ఏమన్నా అడగాలి అనుకున్నా కామెంట్స్ రూపంలో తెలుపగలరు.


 ధన్యవాదములు.

 

 

లేబుళ్లు: , , , , , , , ,

10, నవంబర్ 2021, బుధవారం

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు ఇది కేవలం సామెత కాదు

ఉల్లి చేసిన మేలు తల్లి

కూడా చేయదు ఇది కేవలం

 సామెత కాదు 


  2002వ సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ భార్గడాడ్ ఉల్లిపాయ మీద పరిశోధన చేశారు ఆ పరిశోధన ఏమిటంటే అసలు ఉల్లిపాయ జుట్టుకు ఎలా పనిచేస్తుంది.


ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు, ఆడవాళ్ళ నుండి మగవారి వరకు ఎదుర్కొంటున్న సమస్యలలో జుట్టురాలడం అనేది చాలా పెద్ద సమస్యగా మారింది.


 దీనిని ఎలా అరికట్టాలి అనేవి ఎవరికీ అర్థం కాకుండా పోయింది. ఈ సమస్య నుండి బయట పడడానికి చాలా మంది చాలా విధాలుగా ప్రయత్నిస్తు వున్నారు.


 ఇలా ప్రయత్నించే క్రమంలో కొత్త జుట్టు రావడం ఏమోగానీ ఉన్న జుట్టు ఊడిపోవడం కాయం. అలా ఊడిపోకుండా ఉండాలి అంటే మనం  డాక్టర్లు చెప్పినవి చెయ్యడం మంచిది.


  జుట్టు ఊడిపోకుండా ఉండాలి అంటేఉలిపాయ ఎలా ఉపయోగ పడుతుందో,డాక్టర్ లు ఏం చెప్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం:


 2002వ సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ భార్గడాడ్ ఉల్లిపాయ మీద పరిశోధన చేశారు ఆ పరిశోధన ఏమిటంటే అసలు ఉల్లిపాయ జుట్టుకు ఎలా పనిచేస్తుంది.


 ఉల్లిపాయలో ఉన్న పోషకాలు ఏంటి,అవి జుట్టు పెరగడం లో ఎలా సహాయ పడతాయి, జుట్టు రాలిపోకుండా మరియు జుట్టు ఊడిపోకుండా ఎలా సహాయ పడతాయి అని పరిశోధన చేశారు.


 శాస్త్రవేతలు పరిశోధన చేసి మన జుట్టుకు ఉల్లిపాయ ఎన్ని రకాల ఉపయోగపడుతుందో చెప్పారు.

 

1:

 ఉల్లిపాయలో సల్ఫర్ అధిక మోతాదులో ఉంటుంది.దీనితో పాటు అమోనియా కూడా ఉంటుంది. సల్ఫర్ ఎక్కువగా ఉండటం వలన మనము ఉల్లిపాయను కోసినప్పుడు సల్ఫర్ గాలిలో కలిసిపోయి మన కళ్ళకు తాకినప్పుడు మన కంట్లో నుండి నీళ్లు రావడం జరుగుతుంది.


 ఇక సల్ఫర్ జుట్టుకు ఎలా ఉపయోగపడుతుంది అనే విషయానికి వస్తే, మన జుట్టు లో కెరటిన్ అనే విటమిన్ ఉంటుంది. కెరటిన్ విటమిన్ ని పెంచడంలో సల్ఫర్ అనేది ముఖ్య పాత్ర వహిస్తోంది.


 ఒక విధంగా చెప్పాలంటే మన జుట్టుకు కెరటిన్ విటమిన్ అనేది ఎంత ముఖ్యమో సల్ఫర్ కూడా అంతే ముఖ్యం.


2:

 మన జుట్టు కుదుళ్ల కింద కొల్లాజెన్ అనే ఒక మెష్ ఉంటుంది. దీనినుండి కొల్లాజెన్ అనే పదార్థం విడుదలవుతుంది. ఈ కొల్లాజెన్ వలన మన జుట్టు కదలకుండా ఉంటుంది.


 ఉల్లిపాయ మన జుట్టు కుదుళ్ళకు పెట్టడం వలన జుట్టు కుదుళ్లకు మాత్రమే కాకుండా కొల్లాజెన్ మెష్ కు కూడా చేరి కొల్లాజెన్ ఉత్పత్తి అధికమవడంతో సహాయపడుతుంది.


 దాని వలన కూడా మన జుట్టు వుండకుండా ఉండి జుట్టు పెరగడం లో సహాయపడుతుంది.


3:

 ఉల్లిపాయలో ముఖ్యంగా రెండు విటమిన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే క్యాంఫిరోల్, కొర్సిటీన్. ఈ రెండు విటమిన్స్ ఉండటం వలన మన జుట్టుకు కావలసినంత రక్తప్రసరణ జరుగుతుంది.


 రక్తప్రసరణ సరిగ్గా జరగడం వలన మన జుట్టుకు కావలసిన నీరు మరియు మనం తినే ఆహారంలో ఉండే విటమిన్స్ మరియు ప్రాణవాయువు తగిన మోతాదులో అందుతున్నాయి.


4:

     మన జుట్టుకు గాలిలోనే వ్యర్ధాలు చేరినప్పుడు మరియు మన జుట్టుకు చెమట పట్టినప్పుడు మరియు మన జుట్టుకు ఫంగస్ సోకినప్పుడు మన జుట్టు ఊడిపోవడం మరియు దురదా పుట్టడం లాంటివి జరుగుతాయి.

   ఉల్లిపాయ ఉపయోగించడం వలన మన జుట్టుకు సోకిన ఫంగస్ తొలగించడంలో మరియు కొన్ని రకాల ఎలర్జిస్ ని తొలగించడం లో ఉల్లిపాయ ముఖ్య పాత్ర వహిస్తుంది అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.


 ఉల్లిపాయ ని ఎలా జుట్టుకు తీసుకోవాలి అనే విషయానికి వస్తే,

 

    మీ జుట్టు ను బట్టి ఉల్లిపాయల్ని తీసుకొని మెత్తగా పేస్ట్ లా చేసి ఆ పేస్ట్ ని మీ తలకి మొత్తం పట్టేలా చూసుకోవాలి.

    

    మీరు ఎలాగైతే మీ జుట్టుకు నూనె రాస్తారో అదేవిధంగా ఈ మిశ్రమాన్ని మీ కుదుళ్ల నుండి మీ జుట్టు చివర్ల వరకు అంటుకునేలా పెట్టండి.

    

    ఇలా మిశ్రమాన్ని రాసుకుని 20 నిమిషాల నుండి 30 నిమిషముల వరకు ఉంచుకుని జుట్టు అరేలా చూసుకోవాలి.

    

    జుట్టు ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు నుండి మూడు సార్లు చేయడం వలన మీ జుట్టు పెరగడమే కాకుండా దృఢంగా కూడా ఉంటుంది.

    

    నేను చెప్పినవన్నీ కూడా డాక్టర్లు మరియు శాస్త్రవేత్తలు పరిశోధించి చెప్పినవే.

    

    మీరు నాకు ఏమన్నా చెప్పాలి అనుకున్న లేక నన్ను ఏమని అడగాలి అనుకున్నా కామెంట్స్ రూపంలో తెలుపగలరు.



 ధన్యవాదములు.











లేబుళ్లు: , , , , , , , ,

14, అక్టోబర్ 2021, గురువారం

పెదాలు నల్లగా ఎందుకు ఉంటాయి? జీవితాంతం నల్లగానే ఉంటాయా?

పెదాలు నల్లగా

ఎందుకు ఉంటాయి ?

జీవితాంతం నల్లగానే

ఉంటాయా ?


చాలామంది యువతులు మరియు యువకులు వారి పెదాలు  నల్లగా ఉన్నాయని,దానివల్ల వారు అందంగా కనబడామని అనుకుంటారు.

 అసలు పెదాలు నల్లగా ఎందుకుంటాయి?  నల్లగా ఉన్న పెదాలు అసలు రంగు మారతాయ?  పరిష్కారం ఏమన్నా ఉందా?  లేకపోతే జీవితాంతం ఇలాగే ఉంటాయా?

 ఇలాంటి వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.


 పెదాలు నల్లగా మారడానికి గల కారణాలు:



 పెదాలు నల్లగా మారడానికి గల కారణాలు:


1.మన శరీర రంగును బట్టి కూడా ఉంటాయి.

2. మనము నల్లగా ఉంటే నలుపు రంగులో తెల్లగా ఉంటే ఒక మాదిరి గులాబీ రంగులో ఉంటాయి.

3. మన శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని బట్టి కూడా ఉంటాయి.


4.మనం తాగే మంచినీరు శాతన్ని బట్టి కూడా పెదాల రంగు ఉంటుంది.

5.కొంత మందికి వారసత్వంగా కూడా పేదలకు నలుపు రంగు ఉంటుంది.

6.కొంతమందికి ఎండ వాళ్ళ కూడా పెదాలు నలుపు గా ఉంటాయి.



జీవితాంతం నల్లగానే ఉంటాయా?


 జీవితాంతం పెదాలు నల్లగానే ఉంటాయా అనడిగితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని చెప్పొచ్చు.నేను ఇలా ఎందుకంటున్నానంటే,

 పెదాలు నలుపు దానం అనేది కొంతమందికి పుట్టుకతోనే ఉంటుంది.దానిని మనం వంశపారం పర్యంగా వస్తాయి అని చెప్పొచ్చు.

 ఇలా వంశపారంపర్యంగా పెదాలు నలుపు దానం వచ్చినవారు నలుపు దానం పోవడానికి చికిత్స తీసుకున్నా కూడా ఉపయోగం ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని డాక్టర్లు చెబుతున్నారు.

 ఇప్పుడు మనం పేదలు నలుపుదనం పోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం.

 తీసుకోవలసిన జాగ్రత్తలు:


1.  ముందుగా మన శరీరంలో హిమోగ్లోబిన్ సరిపడా మోతాదులో ఉందో, లేదో తెలుసుకోవాలి.
2. స్త్రీలలో అయితే 12 నుండి 14 గ్రాముల వరకు హిమోగ్లోబిన్ శాతం ఉండాలి.
3. అదే పురుషులలో అయితే 14 నుండి 16 గ్రాముల వరకు హిమోగ్లోబిన్ శాతం ఉండాలి.
4. మరియు మన శరీరంలో ఐరన్ కూడా ఎక్కువ మోతాదులో ఉండాలి.
5. మన శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తగినన్ని మంచినీళ్లు తీసుకుంటూ ఉండాలి.
6. మన వేదాలు పలిగిలినట్లు అనిపిస్తే నెయ్యి రాయడం చాలా మంచిది.
7. రోజుకి రెండు సార్లు నెయ్యి రాస్తే మన పెదాలు పగలడం తగ్గుతుంది.

 ఆహారంలో తీసుకోవలసిన జాగ్రత్తలు:

 
 మన శరీరంలో హిమోగ్లోబిన్ తగిన మోతాదులో ఉండడానికి,మనం ఎక్కువగా రక్తం పట్టే పండ్లను మరియు రసాలను తీసుకోవాలి.
 
 అనగా బీట్ రూట్, దానిమ్మ, ఆపిల్, క్యారెట్ మొదలగు పండ్లను మరియు వాటి రసాలను తీసుకోవాలి.

 మన శరీరంలో ఐరన్ కోసం మనం తీసుకునే ఆహారంలో కనీసం వారంలో 3 రోజులైనా తోటకూర ఉండేలా చూసుకోవాలి.

 తోటకూరలో ఐరన్ చాలా ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. ఇది మన శరీరం అనారోగ్యానికి గురికాకుండా ఉండడానికి కూడా సహాయపడుతుంది.

 పాలను కూడా మనం రోజు తీసుకోవాలి. పాలలో ఉండే విటమిన్స్ మనలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయ పడతాయి.

 నేను చెప్పినవన్నీ కూడా డాక్టర్లు చెప్తున్నావే.

 మీరు నాకు ఏమన్నా చెప్పాలి అనుకున్న లేక నన్ను ఏమన్నా అడగాలి అనుకున్నా కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.


 






లేబుళ్లు: , , , , , ,