పెదాల పగుళ్లు నుండి మీ పెదాలను కాపాడుకోవాలా? అయితే ఇది మీ కోసమే
పెదాల పగుళ్లు నుండి మీ
పెదాలను
కాపాడుకోవాలా? అయితే
ఇది మీ కోసమే
లా మంది యువతులు మరియు యువకులువారు అందంగా కనపడాలి అనుకుంటారు. అలా అందంగా కనపడాలి అని చాలా విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు.
మనం అందంగా కనపడాలి అనుకుని మన మొహన్ని ఎంతో అందంగా తయారు చేసుకుంటాం. ఇలా అందంగా కనపడాలి అనే విషయంలో మన పెదాలు ఎంతో ముఖ్య పాత్ర వహిస్తాయి.
అందువల్ల మనం మన పెదవులకు లిప్‌స్టిక్ లాంటి కొన్ని రసాయనాలు కలిగిన వాటిని ఉపయోగిస్తుంటాం. ఇంకొంతమంది అయితే వారి పెదాలు లిప్‌స్టిక్ రాసిన గాని అందంగా కనపడవు.
వారి పెదాలు పగుళ్ళు మరియు మరి పెదాల నుండి ఊడిపోవడం గమనించవచ్చు. ఇలాంటి వారు ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
చాలామందికి వాతావరణంలో మార్పులు ఏర్పడగానే వారి శరీర భాగాలలో కూడా కొన్ని మార్పులు జరుగుతాయి.
ఆ మార్పులు ఎలా ఉంటాయి అంటే కాళ్ళ పగుళ్ళు మరియు పెదాల పగుళ్లు ఇలా కొన్ని రకాల సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉండడాన్ని మనం గమనించవచ్చు.
నిజంగా మనకు చలికాలం వచ్చినప్పుడు మన పెద్దలు పగలడం మరియు మన నోటి లో పుండ్లు రావడాన్ని గమనించవచ్చు.
ఇది మాత్రమే కాకుండా మనం ఒకటి లేదా రెండు రోజులు చలి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా మన పెదాలు పగలడం గమనించవచ్చు.
ఒక్కొక్కసారి అయితే ఎండాకాలంలో కూడా మన పెదాలు పగలడం గమనించవచ్చు. ఎండాకాలంలో కూడా ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఎండాకాలంలో వచ్చే వడగాలుల వలన పెదాలు పగలడం ఏర్పడుతుంది.
ఇలా పెదాల పగుళ్ళు ఏర్పడి నప్పుడు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వాటి గురించి డాక్టర్లు ఏం చెప్తున్నారు అని మనం ఎప్పుడు కలుసుకుందాం.
పెదాల పగుళ్లు ఏర్పడినప్పుడు మీరు ఎలాంటి డాక్టర్లను సంప్రదించ అక్కరలేదు అని డాక్టర్లే చెబుతున్నారు.
ఎందుకంటే పెదాల పగుళ్ళను పోగొట్టడానికి మన వంటగదిలోనే దివ్యౌషధం ఉంది అని అంటున్నారు డాక్టర్లు.
మొదటి చిట్కా:
అది ఏంటి అంటే నెయ్యి. నెయ్యి మన పెదాలు పగలడం లో ఎలా సహాయపడుతుంది అంటే, మరీ ముఖ్యంగా పెరుగున్ననెయ్యి అంటే చలికాలంలో నెయ్యి పేరుకుంటుంది.
దీనిని మన పెదవులకు రాసినప్పుడు ఆ నెయ్యి మన పగిలిన పెదవులు అతుక్కోవడానికి ఎంతగానో సహాయపడుతుంది అంటున్నారు డాక్టర్లు.
ఈ నెయ్యి ని రోజుకి రెండు నుండి మూడు సార్లు మీకు ఖాళీ ఉన్న సమయంలో మీ పెదవులకు రాసుకోవడం వలన మీ పెదాలు ఎంతో సున్నితంగా మరియు అందంగా నిగనిగలాడటానికి మీరు గమనించవచ్చు.
పేరుకున్న నెయ్యిని మాత్రమే కాకుండా వేసవికాలంలో మామూలు నెయ్యి కూడా మీరు పెదాలకు రాసుకోవచ్చు.
ఇలా నెయ్యి మీ పెదవులకు రాసుకోవడం వలన రెండు రోజుల్లోనే మీరు మంచి ఫలితాలను పొందుతారు అంటున్నారు నిపుణులు.
రెండవ చిట్కా:
కావలసిన పదార్థాలు:
1. పంచదార హాఫ్ టేబుల్ స్పూన్
2. తేనే ( సరిపడినంత)
తయారు చేసుకునే విధానం:
ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో హాఫ్ టేబుల్ స్పూన్ పంచదార మరియు సరిపడినంత తేనె వేసి గట్టిగా అయ్యేంతవరకు కలపాలి.
అలా గట్టిగా అయినా మిశ్రమంను కొంచెం వేలితో తీసుకొని దానిని మీ పెదాలకు మెల్లగా రుద్దాలి. ఇలా రుద్దడం వలన ఏం జరుగుతుంది అంటే,
పంచదార మీ పెదాలపై ఉన్న పలికిన చర్మాన్ని తొలగిస్తుంది. తేనె మీ పెదాలపై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తుంది.
ఇది మాత్రమే కాకుండా పంచదార ఒక మంచి స్క్రబ్ లా పనిచేస్తుంది. కేరళ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ పెదాలు అందంగా కనబడటం లో సహాయం చేస్తాయి.
మూడవ చిట్కా:
కావలసిన పదార్థాలు:
1. పంచదార వన్ టేబుల్ స్పూన్
2. పారాషూట్ ఆయిల్ టేబుల్ స్పూన్
3. నిమ్మకాయ సగం
తయారు చేసుకునే విధానం:
ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ పారాషూట్ ఆయిల్ మరియు ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసి కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత సగం నిమ్మకాయను రసమును ఆ మిశ్రమంలో కలపాలి.
ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక చిన్న కంటైనర్ లోకి తీసుకోవాలి. ఇలా చిన్న కంటైనర్ లోకి తీసుకున్న మిశ్రమంను మన చూపుడువేలుతో తీసుకోవాలి.
ఇలా తీసుకున్న మిశ్రమంను మన పెదవులకు మెల్లగా రుద్దుతూ ఉండాలి. ఇలా రుద్దడం వలన పంచదార ఒక మంచి స్క్రబ్‌లా పనిచేస్తుంది. ఇది మాత్రమే కాకుండా పెదాల పైన పేరుకుపోయి ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ను పోగొడుతుంది.
ఇంకా కొబ్బరి నూనె విషయానికొస్తే కొబ్బరి నూనె మన పెదవుల పైన ఉన్న చర్మం లోపల వరకు వెళుతుంది. అలా లోపల వరకు వెళ్లడం వలన మన పెదవులు ఎండిపోకుండా ఎప్పుడూ నిగనిగలాడుతూ ఉంటాయి.
ఇంకా నిమ్మకాయ విషయానికొస్తే నిమ్మకాయలో ఉండే సి విటమిన్ వలన మన పెదవులు లేత గులాబీ రంగు లోకి వస్తాయి. ఇది మాత్రమే కాకుండా నిమ్మకాయలో ఉండే విటమిన్ సి వలన మన పెదాల పగుళ్ళు తగ్గుముఖం పడతాయి.
నేను చెబుతున్నవన్నీ కూడా డాక్టర్లు చెబుతున్న వే.
మీరు నాకు ఏమన్నా చెప్పాలి అనుకున్న లేక నన్ను ఏమన్నా అడగాలి అనుకున్నా కామెంట్స్ రూపంలో తెలుపగలరు.
ధన్యవాదములు.
లేబుళ్లు: all about lips in telugu, how to stop lips from peeling, lip care, lip care tip, lips care, lips care in winter, Manthena satya narayanaraju, skin care for lips, winter lips care

