ఈ మూడింటితో ఓత్తయిన మరియు దృఢమైన జుట్టు మీ సొంతం
ఈ మూడింటితో ఓత్తయిన
మరియు దృఢమైన జుట్టు
మీ సొంతం
"ప్రకృతిని మనంఎంత గౌరవం ఇస్తే అది మనకు అంతకుమించిన ఆరోగ్యాన్ని మరియు అంతకు మించిన అందాన్ని ఇస్తుంది"
ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకూ ఆడవాళ్ల నుండి మగవారి వరకు అందరూ ఎదుర్కొంటున్న ఒక సమస్య ఏమిటంటే హెయిర్ ఫాల్.
మన అందంగా కనపడాలి అనుకునే విషయంలో మనం జుట్టు గురించి చాలా శ్రద్ధ వహిస్తాం.ఇలా జాగ్రత్తలు తీసుకునే సమయంలో మనం ఎన్నో రకాల షాంపూలు మరియు నూనెలు ఇంకా కొంతమంది అయితే కొన్ని రకాల విటమిన్ టాబ్లెట్స్ కూడా వాడతారు.
ఇంకొంతమంది అయితే ఏది వాడితే ఏమవుతుంది అసలు షాంపూలు వాడొచ్చా,నూనె పెట్టొచ్చా, టాబ్లెట్ వేసుకోవచ్చా ఇవి వాడితే తమ జుట్టు కి ఏమన్నా అవుతుందా, ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఉన్నది కాస్తా ఊడిపోతుంది కదా అనే సందర్భంలో పడతారు.
కొన్ని రకాల షాంgపూలు వాడటం వలన జుట్టు ఊడిపోతుంది. నూనె మారటం వలన కూడా జుట్టు ఊడుతుంది అని మాత్రమే కాకుండా డాండ్రఫ్ కూడా వస్తుంది. ఇంకా ట్యాబ్లెట్ విషయానికి వస్తే కొన్ని టాబ్లెట్స్ మంచి ఉంటాయి అవి వాడితే రిజల్ట్ కనబడుతోంది, ఇంకొన్ని వాడితే సైడ్ఎఫెక్ట్స్ రావడం తప్పనిసరి అవుతుంది అనడంలో తప్పులేదు అనిపిస్తోంది.
ఇలా మనం తెలిసీ తెలియక మన జుట్టుకు తీసుకునే జాగ్రత్తల్లో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం.ఎలాంటి తప్పులు చేయకుండా మన జుట్టును జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మనకు ప్రకృతి నుండే ఎన్నో రకాల దివ్య ఔషధాలు ఉన్నాయి అని చెప్తున్నారు నిపుణులు.
ప్రకృతి నుండి మనకి లభించని విటమిన్ ఏమీ లేవు. ఏది కావాలన్నా కూడా మనకి ప్రకృతిలో లభిస్తుంది. ప్రకృతిని మనం ఎంత గౌరవం ఇస్తే అది మనకు అంతకు మించిన ఆరోగ్యాన్ని ఇస్తుంది.
ఈ విషయాన్ని మనం ఎంత గుర్తు పెట్టుకుంటే మనం అంత ఆరోగ్యంగా మరియు అంతకు మించిన అందంగా ఉంటాము అనడంలో సందేహం లేదు.
మనం ప్రకృతి నుండి లభించే వాటితో ఎలా ఆరోగ్యంగా ఉండాలి మరియు అందంగా ఎలా కనపడాలి అనే వాటి గురించి మనం ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారో తెలుసుకుందాం.
మొదటి చిట్కా:
కావలసిన పదార్థాలు:
1. కలబంద (అలోవెరా)
2. కొబ్బరి నూనె
3. ఉల్లిపాయలు
తయారు చేసుకునే విధానం:
ముందుగా కలబంద గుజ్జును తీసుకోవాలి. ఇలా తీసుకున్న కలబంద గుజ్జులో మీ జుట్టుకు సరిపడినంత కొబ్బరి నూనెను వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఉల్లిపాయ రసంను ఆ మిశ్రమంలో కలిసి పోయేంతవరకు కలపాలి.
ఇలా కలిపిన మిశ్రమం మీ జుట్టుకు బాగా పట్టించాలి. ఇలా మిశ్రమంను పట్టించిన మీ జుట్టును ఒక గంట పాటు వదిలేయండి.
గంట తర్వాత వెళ్లి తల స్నానం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు ఈ చిట్కాను పాటించినట్లయితే మీరు మంచి ఫలితాలు పొందుతారు.
ప్రయోజనాలు:
1. అలోవెరా( కలబంద):
అలోవెరా లో ఉండే పోషకాలు ఏంటి మన జుట్టు పెరగడం లో ఏ విధంగా సహాయ పడతాయి అనే వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అలోవెరా లో విటమిన్ ఇ అధిక మోతాదులో ఉంటుంది. ఇది మన జుట్టు యొక్క కుదుళ్లకు విటమిన్ ఇ అందించడం మాత్రమే కాకుండా ఊడిన జుట్టు తిరిగి రావడం లో కూడా ఎంతగానో సహాయపడుతుంది.
2. కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె లో ఉండే పోషకాలు ఏంటి అవి మన జుట్టు పెరుగుదల ఏ విధంగా సహాయ పడతాయి అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం
జుట్టు పెరుగుదలలో కొబ్బరి నూనె ఎంతగా సహాయపడుతుందో అందరికీ తెలుసు. మన పూర్వీకుల నుండి కొబ్బరి నూనె జుట్టుకు రాయడం ఒక ఆచారంగా ఉంది అనడంలో సందేహం లేదు.
మన పూర్వీకులు జుట్టు మరియు ఇప్పటి జనరేషన్ జుట్టు చూసుకుంటే చాలా తేడా మనం గమనించవచ్చు. దానికి కారణాలు ఏవైనా కావచ్చు. ఇప్పుడు పెరుగుతున్న పొల్యూషన్, వాతావరణంలో జరిగే మార్పులు, మనం తీసుకునే ఆహారంలో తగిన మోతాదులో విటమిన్స్ లేకపోవడం ఇలా ఏవైనా కావచ్చు.
జుట్టుకు నూనె రాయడం వలన మన జుట్టు హార్డ్ గా ఉండకుండా సాఫ్ట్ గా ఉంటుంది.మన జుట్టు చివర్లో చిట్లినప్పుడు నూనె రాయడం వలన చిట్లిన జుట్టు మామూలుగా అవ్వడానికి సహాయపడుతుంది.
సూర్యుడి నుండి ఎండ తగిలినప్పుడు మన జుట్టు హార్డ్ గా అవడం మాత్రమే కాకుండా మన జుట్టు యొక్క రంగు మారుతుంది అంటున్నారు డాక్టర్లు.
మన జుట్టు నలుపు రంగు నుండి ఎరుపు రంగులోకి మారుతుంది అంటున్నారు. అలా జుట్టు రంగు మారకుండా ఉండాలి అంటే జుట్టుకు నూనె రాయడం మంచి మార్గం అంటున్నారు డాక్టర్లు.
3. ఉల్లిపాయ:
ఉల్లిపాయ లో ఉండే పోషకాలు ఏంటి అవి మన జుట్టు పెరుగుదల మరియు మన జుట్టును రక్షించడంలో ఏ విధంగా సహాయ పడతాయి అనే వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయలో సల్ఫర్ అధిక మోతాదులో ఉంటుంది దీనితో పాటు అమ్మోనియా కూడా ఉంటుంది. సల్ఫర్ మన జుట్టు పెరగడం లో మరియు మన జుట్టును సంరక్షించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది.
సల్ఫర్ మన జుట్టు కుదుళ్లకు కావలసిన విటమిన్స్ ని అందిస్తోంది. ఇది మాత్రమే కాకుండా మన జుట్టుకు కావలసిన రక్త ప్రసరణను మరియు ఆక్సిజన్ ను అందిస్తుంది.
మన జుట్టు కుదుళ్లలో పేరుకుపోయి ఉన్న వ్యర్ధాలను తొలగించడంలో కూడా ఉల్లిపాయలో ఉండే విటమిన్స్ సహాయ పడతాయి అనడంలో సందేహం లేదు.
నేను చెప్పినవన్నీ కూడా జుట్టుకు సంబంధించిన నిపుణులు చెబుతున్నావే. కాబట్టి మీరు ఎలాంటి సందేహాలు లేకుండా వీటిని ప్రయత్నించవచ్చు.
మీరు నాకు ఏమన్నా చెప్పాలి అనుకున్న లేక నన్ను ఏమని అడగాలి అనుకున్నా కామెంట్స్ రూపంలో తెలుపగలరు.
ధన్యవాదములు.
లేబుళ్లు: aloe vera for hair, aloe vera hair, coconut oil for hair how to, coconut oil hair, Hair care, hair growth aloe vera, hair growth with coconut, hair growth woth onion, onion juice, onion juice for hair growth

